2016 లోనే తల్లినయ్యా.. హీరోయిన్ కాకముందే అంటూ తృప్తి డిమ్రీ సీక్రెట్ రివీల్
దేశ సినీ పరిశ్రమలో సినీ ప్రేక్షకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న హీరోయిన్లలో తృప్తి డిమ్రి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. యానిమల్ సినిమా తర్వాత ఆమె ఒక్కసారిగా నేషనల్ క్రష్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నది. ఆ సినిమా తర్వాత వచ్చిన వరుస ఆఫర్లను అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో యానిమల్ సినిమాకు ముందు ఉన్న తన పరిస్థితిని వివరిస్తూ..
తృప్తి డిమ్రీ కెరీర్ విషయానికి వస్తే.. మామ్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బుల్‌బుల్, కాలా సినిమాలు చేసింది. అయితే అంతగా ఆమెకు పాపులారిటీ రాలేదు. యానిమల్ సినిమాలో గ్లామర్ పాత్రలో ఆకట్టుకోవడంతో ఆమె జాతకమే మారిపోయింది.

యానిమల్‌కు ముందు తృప్తి డిమ్రీ బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ తగినంత గుర్తింపు లభించలేదు. యానిమల్‌లో శృంగారతారగా రణ్‌బీర్ సింగ్‌తో కలిసి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించింది. దాంతో ఒక్కసారిగా హాట్ గర్ల్ ఎవరనే విషయంపై ఆరా తీశారు. ఆ సినిమా తర్వాత ఆమె పేరు బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.
యానిమల్ తర్వాత ఆమె నటించిన బ్యాడ్ న్యూజ్ సినిమా భారీ విజయం సాధించింది. ఆ సినిమాలో వికీ కౌశల్‌తో హాట్ హాట్‌గా నటించడంతో ఆమెపై ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఆమె నటించిన భూల్ భులయ్యా 3 చిత్రం కూడా భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. దాంతో ఈ ఏడాదిలోపే హ్యాట్రిక్ విజయాలను అందుకొన్నది. ప్రస్తుతం ధడక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తన జీవిత ప్రయాణం గురించి ఆనందం వ్యక్తం చేస్తూ.. తన కెరీర్ గురించి వివరిస్తూ..\

ముంబైలో అవకాశాల కోసం ప్రయత్నించడానికి ముందు ఢిల్లీలో ఓ యాడ్ కంపెనీతో కాంట్రాక్టు ఉండేది. వారి తీసే వ్యాపార ప్రకటనల్లో నటించే దానిని. అప్పుడుప్పుడు ముంబైకి వచ్చి పోతుండే దానిని. అయితే ముంబైలో నాకంటూ ఇల్లు లేదు. ఆ సమయంలో డబ్బులు లేకపోవడం వల్ల హోటల్‌లో కూడా ఉండే పరిస్థితి లేకపోయింది. దాంతో డిల్లీ యాడ్ కంపెనీకి చెందిన ఫ్లాట్ ముంబైలో ఉండేది. వారి త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో మోడల్స్ అందరం కలిసి ఉండే వాళ్లం అని త్రిప్తి డిమ్రి చెప్పారు.
తొలి యాడ్ షూటింగ్ కోసం ముంబైలో వచ్చి.. సంతూర్ సబ్బు యాడ్‌లో నటించాను. నేను చిన్న వయసులోనే తల్లి పాత్రలో నటించాను. ఆ సమయంలో ముంబైలోని ప్రధానంగా ఉండే ప్రాంతాల్లో షూటింగ్ చేస్తే అందులో పాల్గొన్నాను. అలా నేను హీరోయిన్‌గా మారక ముందే నేను తల్లి ఫాత్ర ఆఫర్ వస్తే అంగీకరించాను. ఆఫర్ వచ్చింది కదా అని అలా సంతూర్ మమ్మీగా నటించాను అని తృప్తి తెలిపారు.


Click it and Unblock the Notifications











