రష్మిక మందన్నకు షాక్.. నేషనల్ క్రష్ ట్యాగ్ లాగేసుకొన్న త్రిప్తి దిమ్రి!
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో ఒక్క ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం గగనం అయితే ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా ట్రెండ్ లో ఓ హీరోయిన్ ఏకంగా టోటల్ ఇండియన్ యూత్ ని ఒక్కసారిగా తన వైపుకి తిప్పుకుంది. మరి ఆ హీరోయిన్ నే త్రిప్తి దిమ్రి. బాలీవుడ్ కి చెందిన ఈ హాట్ బ్యూటీ మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో చేసిన స్ట్రైట్ సినిమా "ఆనిమల్" లో కనిపించి అదరగొట్టింది.
కాగా ఈ చిత్రంలో హీరోగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించగా నేషనల్ క్రష్ రష్మికా మందన్న మెయిన్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రంలో రష్మికా మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచినప్పటికీ ఒక్కసారి స్క్రీన్ మీదకి త్రిప్తి దిమ్రి వచ్చిన తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది.

షో ని ఆమె తన గ్లామరస్ షోతో అందంతో స్టీల్ చేసేసింది. దీనితో ఒక్కసారిగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న త్రిప్తి దిమ్రి ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ కేక్ లా మారింది. కాగా ఈమె ఆ సినిమాలో రష్మిక భర్తని లాక్కుంటే ఇప్పుడు బయట రష్మిక నుంచి మరొకటి కూడా లాక్కున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఇన్నాళ్లు ఇండియా సినిమా దగ్గర నేషనల్ క్రష్ ఎవరు అంటే రష్మికా మందన్నా పేరు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ ట్యాగ్ నే త్రిప్తి దిమ్రి లాక్కుందట.
కాగా ఈమె నటించిన రీసెంట్ చిత్రం "బ్యాడ్ న్యూజ్" లో రిలీజ్ అయ్యింది. బోల్డ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరోగా నటించాడు. రీసెంట్ గా వీరిద్దరి నడుమ వచ్చిన ఓ సాంగ్ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యి తన గ్లామర్ షోతో ఒక్కసారిగా త్రిప్తి దిమ్రి సోషల్ మీడియాని షేక్ చేసింది. కాగా ఈ సినిమాకి ఆమె పేరు వేసినప్పుడు "నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రి" అని పడింది.

దీంతో రష్మిక నుంచి ఈ ట్యాగ్ ని ఆమె లాక్కుంది అని చెప్పాలి. అయితే ఆనిమల్ సినిమా తర్వాత త్రిప్తి దిమ్రి చాలా మందికి క్రష్ లా మారింది అనే మాట వాస్తవం మరి ఆ కోణంలో ఏమన్నా ఇది పెట్టుకొని ఉండొచ్చు కానీ రష్మికకి ఆల్రెడీ ఉన్న ట్యాగ్ నే లాక్కుందని చెప్పలేం.
ఏది ఏమైనప్పటికీ మాత్రం ఆసక్తిగా రష్మికతో ఈమె సినిమాలో మాత్రమే కాకుండా బయట కూడా ఇలా పోటీ నెలకొనడం ఒకింత ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి. కాగా ఈ ఇద్దరూ మళ్ళీ ఆనిమల్ సినిమా సీక్వెల్ లో కలిసి కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఆల్రెడీ పార్ట్ 2 ఆనిమల్ పార్క్ అంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











