అతడితో నా పెళ్లి.. వైరల్‌గా త్రిషా కృష్ణన్ సోషల్ మీడియా పోస్ట్!

దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ త్రిషా కృష్ణన్‌పై రోజుకో కొత్త రూమర్, గాసిప్ వార్తలు జోరందుకొంటున్నాయి. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంపై వస్తున్న వార్తలపై కొంత కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల తమిళ సినీ జర్నలిస్టు చేసిన కామెంట్స్‌పై త్రిషా ఘాటుగా స్పందించారు. తన లైఫ్‌పై వస్తున్న ఊహాగానాలకు తనదైన శైలిలో తెర దించే ప్రయత్నం చేశారు. అయితే తన ఇన్స్‌టాగ్రామ్‌లో త్రిషా పోస్టు చేసినది ఏమిటి? తనపై వస్తున్న రూమర్లకు ఇచ్చిన సమాధానం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే.

విజయ్, ఆయన భార్య సంగీత దాంపత్య జీవితంలో చోటు చేసుకొన్న కలతలు, విభేదాలు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. వారి వైవాహిక జీవితం బ్రేకప్ కావడానికి కారణం త్రిషా అనే రూమర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ రూమర్లకు బలం చేకూరేలా తమిళ సినీ నిర్మాత ఇంట్లో జరిగిన వివాహానికి త్రిషా, విజయ్ కలిసి హాజరు కావడంతో వారి మధ్య అఫైర్‌కు నిజమేనని స్పష్టమైంది.

Trisha Krishan befitting replaly on Rumours

అయితే ఇలాంటి పరిస్థితుల్లో తమిళ జర్నలిస్ట్ చిత్రా లక్ష్మణన్ తాజా మీడియా ఇంటర్వ్యూలో త్రిషా కెరీర్, సినీ జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిషా సినీ రంగానికి గుడ్ బై చెప్పబోతున్నారని ఓ నిర్మాత నాకు చెప్పారు. ఆమె కొత్తగా సినిమా ఆఫర్లను అంగీకరించడం లేదు. ఇక ఆమె యాక్టింగ్‌కు దూరం కానున్నారు అనే విధంగా తన అభిప్రాయాన్ని, తనకు లభించిన సమాచారాన్ని వెల్లడించారు. అయితే చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్‌పై త్రిషా ఘాటుగా స్పందించారు.

తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ. నేను సినిమా రంగం నుంచి తప్పుకొంటున్నాను. సంపన్న బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకొన్నాను. ఆయన ద్వారా నాకు నలుగురు కవల పిల్లలు ఉన్నారు. వారికి నిన్ననే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇంతకు మించి ఏదైనా చెప్పాలా? ఇది మీకు సరిపోతుందా? ఈ ఫిక్షనల్ కోటా ఈ రోజుకు చాలా అంటూ త్రిషా పోస్టు పెట్టారు. తనపై వస్తున్న రూమర్లకు పరోక్షంగా సమాధానం ఇచ్చి నోరు మూయించే ప్రయత్నం చేశారు.

అయితే తనపై వస్తున్న రూమర్లు, ఊహాగానాలపై త్రిషా ఇప్పటి వరకు ఏనాడు స్పందించలేదు. కానీ తాజాగా తమిళ జర్నలిస్ట్ చేసిన కామెంట్స్‌కు ఓ రకంగా ఫన్నీగా, ఘాటుగా స్పందించడంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే త్రిషా చేసిన కామెంట్స్‌కు చిత్రా లక్ష్మణన్ రిప్లే ఇస్తారా? ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతారా? వేచి చూడాల్సిందే.

త్రిషా కెరీర్ విషయానికి వస్తే.. విజయ్‌తో కలిసి లియో, గోట్ చిత్రాల్లో నటించిన తర్వాత.. అజిత్‌తో కలిసి విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ చిత్రాల్లో నటించింది. సూర్యతో కరుప్పు, చిరంజీవితో విశ్వంభర, మలయాళ చిత్రం రామ్‌లో సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో కలిసి నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: trisha krishnan vijay kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X