HBD Trisha Krishnan : సెకండ్ ఇన్నింగ్స్‌లో పెరిగిన త్రిష సంపాదన!.. విశ్వంభర బ్యూటీ ఆస్తులు ఎన్ని కోట్లంటే?

కొందరిని చూస్తే వారి వయసు పెరుగుతుందా? తరుగుతుందా అర్ధం కాదు. ఈ కోవలోకే వస్తారు చెన్నై కుట్టి త్రిష. ఈ ముద్దుగుమ్మకు 41 ఏళ్ల వయసంటే ఎవరూ నమ్మరు. 25 ఏళ్ల క్రితం తొలి సినిమా చేసే సమయంలో ఎలా ఉందో ఇప్పటికే త్రిష అలానే ఉన్నారు. ఈ వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో పాటు సౌత్‌లో నెంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు త్రిష. మే 4న త్రిష పుట్టినరోజు.. ఈ రోజు ఆమె 42వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా త్రిష కృష్ణన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు పరిశీలిస్తే :

Trisha Krishnan birthday special here s the vishwambhara actors s net worth and Assets Details

మోడల్‌గా కెరీర్ మొదలు

1983 మే 4న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు త్రిష. గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ వైపు వెళ్లిన ఆమె మిస్ సేలం, మిస్ చెన్నై పోటీలలో పాల్గొని గెలుపొందారు. 2001లో మిస్ ఇండియాలో బ్యూటీఫుల్ స్మైల్ అవార్డును అందుకున్నారు. తర్వాత సినీ రంగం వైపు అడుగు పెట్టిన త్రిష.. ప్రశాంత్ - సిమ్రన్ జంటగా నటించిన జోడీ అనే సినిమాతో 1999లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు వారిని పలకరించిన త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పూర్ణమి, స్టాలిన్, సైనికుడు, కృష్ణ, కింగ్, తీన్మార్, దమ్ము తదితర చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌన్స్ బ్యాక్

25 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో అందరు అగ్రహీరోల సరసన నటించారు. ఒకదశలో ఆమె కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన త్రిష కూడా పెళ్లి చేసుకుని జీవితంలో స్ధిరపడాలని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. అయితే అనివార్య కారణాలతో ఈ పెళ్లి రద్దయ్యింది. కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిన త్రిష తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస హిట్స్‌తో దుమ్మురేపుతున్నారు.

త్రిష చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లు

పొన్నియన్ సెల్వన్ సిరీస్‌, ది రోడ్, లియో, గోట్, ఐడెంటిటి, విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించారు. పొన్నియన్ సెల్వన్‌లో ఐశ్వర్యరాయ్‌ని మించిన అందంతో షాకిచ్చారు. ప్రస్తుతం థగ్ లైఫ్, విశ్వంభర, సూర్య 45, రామ్ వంటి చిత్రాలలో నటించారు. ఇవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే కావడం విశేషం. దక్షిణాదిలో ఇప్పుడు సీనియర్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారారు త్రిష కృష్ణన్.

హైదరాబాద్, చెన్నైలలో త్రిషకు ఆస్తులు

25 ఏళ్ల కెరీర్‌లో ఆమె భారీగానే ఆస్తులు కూడబెట్టారు. ప్రస్తుతం సినిమాకు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే త్రిష.. భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. సినిమాలతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌లు, వ్యాపారాలతో త్రిష బాగానే సంపాదిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్‌లలో త్రిషకు విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. వీటి విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆమెకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం .. త్రిష గ్యారేజ్‌లో బెంజ్, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. మొత్తంగా త్రిష ఆస్తుల విలువ రూ. 120 కోట్ల పైమాటేనని కోలీవుడ్ టాక్. త్వరలో విశ్వంభర, థగ్ లైఫ్‌తో పలకరించనున్న త్రిష జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటోంది ఫిల్మీ బీట్.

More from Filmibeat

Read more about: trisha krishnan movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X