Trisha: విజయ్‌తో అఫైర్ రూమర్లు.. ఘాటుగా త్రిష పోస్ట్
తమిళ సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో హాట్ టాపిక్‌గా మారిన విషయాల్లో ఒకటి విజయ్ పొలిటికల్ ఎంట్రీ, రెండోది ఆయనతో త్రిష అఫైర్ విషయం. అయితే విజయ్ త్రిషతో డేటింగ్ చేస్తున్నారనే విషయం తమిళ మీడియాలో కలకలం రేపింది. దాంతో విజయ్ వైవాహిక జీవితంలో ఏం జరుగుతున్నదనే విషయంపై అందరి దృష్టిపడింది. ఈ క్రమంలో త్రిష సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఆమె నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
త్రిష కృష్ణన్ దక్షిణాదిలో గత రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఆమె అగ్ర హీరోలతో కలిసి నటించారు. అయితే తన కెరీర్‌లో చాలా మంది హీరోలతో రిలేషన్‌షిప్ అంటూ గాసిప్స్ వచ్చాయి. కానీ అవి పెద్దగా వార్తల్లో నిలువలేకపోయాయి. కానీ విజయ్‌తో అఫైర్ వార్త మాత్రం మీడియాలో సంచలనం రేపింది.

ఇలాంటి పరిస్థితుల్లో త్రిష.. కొందరు చేసే తప్పులను పట్టించుకోవడం లేదు. వారు ఏం తప్పు చేస్తున్నారనే విషయనాన్ని చెప్పడానికి నా ఎనర్జీని వేస్ట్ చేసుకోను. నాకంత ఎనర్జీ ఉందని అనుకోవడం లేదు. ఎవరైనా నా గురించి చెత్త రాసినా, వాగినా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక వారితో వాగ్వాదం పెట్టుకోవడం ఇష్టం లేదు. వారితో గొడవ పడను. డ్రామా అసలు క్రియేట్ చేయడం ఇష్టం లేదు. సింపుల్‌గా వారికి దూరంగా ఉంటూ మౌనం పాటించడమే ఉత్తమ మార్గం అని ఆమె అన్నారు.
నీకు నీవుగా అండగా నిలిచేలా ఓ సిస్టమ్ క్రియేట్ చేసుకో. నీవేదైనా మంచి చేస్తే.. నీకు నీవే చెప్పట్లు కొట్టుకో. ఒకరి ప్రశంస కోసం వేచి చూడకు. నీ విజయాన్ని నీవే ఆస్వాదించు. నీవు ఏదైనా సాధిస్తే దాని ప్రతిఫలం నీకే ఆపాదించుకో. నీ కోసం నీవు బతుకు. మరొకరి కోసం బతకడం వదిలేయ్. నీ కోసం నీవు బతకడం నేర్చుకో అని త్రీష ఎమోషనల్ అయింది.

జీవితంలో నీకు ఎవరో ఒకరు ఏదో చేస్తారని ఆశించకు. ఒకరి నుంచి నీవు ఏమీ ఆశించకు. నీ లైఫ్‌కు ఏం కావాలో దానిపై దృష్టి పెట్టుకో. ఎవరు ఏమంటారో అనే విషయాన్ని అసలే పట్టించుకోకు అంటూ త్రిష వేదాంతం, జీవిత సత్యాలను వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ తన పని తాను చేసుకొనే ఆమె ఇలా ఎందుకు బరస్ట్ అయిందనే విషయం చర్చనీయాంశమైంది.
త్రిష కెరీర్ విషయానికి వస్తే.. విజయ్‌తో కలిసి లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాల్లో నటించింది. చిరంజీవితో కలిసి విశ్వంభర సినిమాలోను, అజిత్‌తో కలిసి విదాముయార్చి అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హాసన్‌తో థగ్ లైఫ్, మోహన్ లాల్‌తో కలిసి రామ్, అలాగే ఐడెంటిటీ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు ఆమె నటించిన చిత్రాలు 2025 భారీగా రిలీజ్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











