త్రిషా సోషల్ మీడియా పోస్ట్ ట్రెండింగ్.. విజయ్ ప్రేమ గురించి నర్మగర్భంగా మెసేజ్!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఓ వైపు వేడి పుట్టిస్తుంటే.. మరో వైపు టీవీకే పార్టీ అధినేత, సూపర్ స్టార్ విజయ్, హీరోయిన్ త్రిషా రిలేషన్‌షిప్, ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తమిళ శాసన సభకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఇళయదళపతి బిజీగా ఉంటే.. ఆయన భార్య సంగీత కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసి అతడిపై భారీగా ఆరోపణలు చేయడంతో త్రిషాకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే తాజాగా త్రిషా చేసిన సోషల్ మీడియా పోస్టు ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఆమె చేసిన పోస్టు వివరాల్లోకి వెళితే..
విజయ్, త్రిషా మధ్య వివాహేతర బంధం కొనసాగుతుందనే విషయం గత కొద్దికాలంగా మీడియాలో నానుతూనే ఉంది. వారిద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్లడం.. అక్కడ విజయ్‌తో త్రిషా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వారిద్దరి బంధంపై క్రేజీ రూమర్ క్రియేట్ అయింది. అయితే వారిద్దరూ ఎప్పడూ కూడా తమ రిలేషన్‌షిప్ గురించి పబ్లిక్‌గా మాట్లాడకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఇటీవల చెన్నై కోర్టులో విజయ్ భార్య సంగీత విడాకులు పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపింది. తన భర్తకు ఓ హీరోయిన్‌కు అక్రమ సంబంధం ఉంది. ఆ కారణంగా మేమిద్దరు వేర్వేరుగా జీవిస్తున్నాం. నా భర్త చేసిన ద్రోహానికి నేను మానసికంగా క్షోభను అనుభవిస్తున్నాను. కాబట్టి మాకు విడాకులు మంజూరు చేయండి అంటూ ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. దాంతో విజయ్, త్రిషా వ్యవహారం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ఇదిలా ఉండగా, భార్య సంగీతతో విడాకుల వ్యవహారం కొనసాగుతుండగానే.. తమిళ సినిమా రంగంలో ప్రముఖ నిర్మాత ఇంట్లో జరిగిన వివాహా కార్యక్రమానికి విజయ్, త్రిషా కలిసి ఒకే కారులో రావడంతో వారిద్దరి రిలేషన్‌షిప్‌కు అధికారికంగా ముద్ర పడింది. దాంతో వారి రహస్య బంధం ఓపెన్ అయింది. అంతేకాకుండా విజయ్ సినీ, రాజకీయ జీవితంలో త్రిషా కీలకంగా మారబోతున్నదనే విషయంపై చర్చ జరుగుతున్నది.
ఇలాంటి సమయంలో త్రిషా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి అనేక రకాలుగా మరోసారి చర్చకు తెరలేపింది. లవ్ మాత్రమే జీవితం కాదు. కానీ లవ్ లేకుండా జీవితానికి పరమార్థం లేదు అని నర్మగర్భంగా పోస్ట్ పెట్టింది. దాంతో రాజకీయ వర్గాలు, సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త వాదనకు తెరలేపారు. అయితే త్రిషా సోషల్ మీడియా పోస్టు వెనుక మర్మం ఏమిటనే విషయం హాట్ టాపిక్ అయింది. సంగీతను టార్గెట్ చేసిందా? లేదా విజయ్‌తో తన బంధాన్ని కన్ఫార్మ్ చేసిందా? అని ఫ్యాన్స్ పలువిధాలుగా చర్చించుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











