హీరోయిన్ కు తల్లిగా త్రిష.. బాలయ్య సినిమా కోసం భారీ రెమ్యునరేషన్?
ఇప్పుడున్న సౌత్ హీరోయిన్స్ అందరికంటే ఎక్కువ సీనియారిటీ ఉన్న వారిలో త్రిష కృష్ణన్ ఒకరు. ఆమె గత 20 ఏళ్ల నుంచి సినిమా ప్రపంచంలో కొనసాగుతోంది. తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం భాషల్లో విభిన్నమైన సినిమాలు చేసిన త్రిష అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగు తమిళంలో అయితే దాదాపు స్టార్ హీరోలందరితో కూడా ఆమె నటించింది. ఇప్పటికీ కూడా తన రేంజ్ కు తగ్గట్టుగానే ఆమె సినిమాలు చేస్తోంది. ఇక రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాతో కూడా ఆకట్టుకుంది.
అయితే త్వరలోనే త్రిష నందమూరి బాలకృష్ణ సినిమాలో కూడా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. అంతేకాకుండా ఆమె ఒక 20 ఏళ్ళ హీరోయిన్ కు తల్లి పాత్రలో నటించవచ్చు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకుడు అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ 108వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక అందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది అయితే ఇంకా ఫైనల్ కాలేదు. కానీ పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీలా మాత్రం బాలకృష్ణ కూతురిగా కనిపించబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఈ ప్రాజెక్టులో శ్రీ లీల కు తల్లి పాత్రలో ఎవరు అయితే సెట్ అవుతారు అనే విషయం గురించి ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. ఇక చాలావరకు వారి ఫోకస్ ఎక్కువగా త్రిష పైనే ఉన్నట్లు సమాచారం.
త్రిష కూడా తెలుగు సినిమా చేసి చాలాకాలం అయింది. మధ్యలో ఆమెకు కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా కంటెంట్ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు టాక్. ఇక బాలకృష్ణ ప్రాజెక్ట్ కోసం ఆమెను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే 20 ఏళ్ల హీరోయిన్ కు తల్లి పాత్రలో అంటే త్రిష రేంజ్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పించాలని కూడా అనుకుంటున్నారట. దాదాపు 1 కోటికి పైగా రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో అయితే కోటి కంటే తక్కువ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకుంటూ సినిమాలు చేస్తోంది. మరి బాలకృష్ణకు జోడిగా 20 ఏళ్ల హీరోయిన్ కు తల్లిగా త్రిష నటిస్తుందో లేదో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











