విశ్వంభరలో డబుల్ రోల్.. చేసేది చిరంజీవి కాదు.. అదే అసలైన సర్‌ప్రైజ్
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎన్నో క్రేజీ సినిమాలు రూపొందుతోన్నాయి. అందులో భారీ బడ్జెట్‌తో వచ్చే చిత్రాలు కొన్నైతే.. విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందే సినిమాలు మరికొన్ని. ఇప్పుడలా తెరకెక్కుతోన్న మూవీల్లో 'విశ్వంభర' ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందిస్తున్నాడు.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'విశ్వంభర' సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఏ విషయంలోనూ, ఎక్కడా కాంప్రమైజ్ అనేది కాకుండా ముకుంద సాగిపోతోంది.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిషపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోన్నారు.
ఫుల్ లెంగ్త్ గ్రాఫిక్స్‌తో రాబోతున్న 'విశ్వంభర' మూవీలో హీరోయిన్‌గా సీనియర్ హీరోయిన్ త్రిషను తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'విశ్వంభర' సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడీ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో యమ చక్కర్లు కొడుతోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'విశ్వంభర' సినిమాలో త్రిష డుయల్ రోల్ చేస్తుందట. ఈ విషయం రివీల్ అయినప్పుడు వచ్చే ట్విస్ట్ ఆడియెన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. దీంతో చిరంజీవి సినిమాలో త్రిష పాత్రపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటిలు కీలక పాత్రలను చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











