త్రిషకు బంపర్ ఆఫర్.. సంచలన నిర్ణయం దిశగా విజయ్!

దక్షిణాదిలో అగ్ర నటి త్రిషా కృష్ణన్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ప్రస్తుతం గోల్టెన్ పీరియడ్ నడుస్తున్నదనే చెప్పాలి. నటిగా అగ్ర హీరోలతో నటించడమే కాకుండా ఆ చిత్రాల ద్వారా భారీ హిట్స్‌ను సొంతం చేసుకొంటున్నది. ఇక మే నెలలో సౌత్ సూపర్ స్టార్ విజయ్‌తో డేటింగ్ రూమర్ల మధ్య ఆయన తమిళనాడు సీఎం బాధ్యతలు చేపట్టడం ఓ మంచి శకునం కాగా, అదే విధంగా సూర్యతో నటించిన కరుప్పు చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టడం ఆమెకు ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ ఏమిటో మరోసారి రుజువు అయింది. అయితే మే నెల త్రిషకు మరిచిపోలేని నెలగా మారింది. అయితే ఇలాంటి పాజిటివ్ వార్తల మధ్య త్రిషకు సంబంధించిన ఓ రూమర్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

విజయ్, త్రిషా మధ్య డేటింగ్ రూమర్లు అనధికారికంగా మీడియాలో వెలుగు చూసినప్పటికీ.. వాటిని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేకపోయారు. కానీ విజయ్, త్రిషా వెకేషన్ సమయంలో దిగిన సెల్ఫీ ఫోటో మాత్రం అధికారికంగా మారి మధ్య ఏదో సంబంధం ఉందనే పొగను బయటకు పంపింది. అలాంటి రూమర్ కొనసాగుతుండగానే.. విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌లో తన కాపురంలో కలతలు చోటు చేసుకోవడానికి ఓ అగ్ర హీరోయిన్‌తో సంబంధమే.. వారిద్దరి అక్రమ బంధం కారణంగా తాను మానసిక క్షోభను అనుభవిస్తున్నాను అనే విషయం బయటపెట్టింది. దాంతో విజయ్, త్రిష మధ్య డేటింగ్ రూమర్‌కు అధికారికంగా ముద్ర పడే అవకాశం ఏర్పడింది.

Trisha Krishnan entry into Politics

భార్య సంగీత విడాకుల పిటిషన్ సరిగ్గా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజిగా ఉన్న సమయంలో బయటకు పొక్కింది. గోప్యంగా ఉండాల్సిన ఆ విడాకుల పిటిషన్ బయటకు రావడం వెనుక తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీ హస్తం ఉందనే వాదన, వార్త బయట భారీగా ప్రచారం జరిగింది. ఆ క్రమంలో విజయ్, త్రిష ఇద్దరు కలిసి ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో పాల్గొనడంతో వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్‌కు అధికారికంగా ధృవీకరణ జరిగే ప్రయత్నానికి బలంగా బీజం పడింది.

తమిళనాడు ఎన్నికల్లో రెండు అతి పెద్ద ద్రవిడియన్ పార్టీలకు చెక్ పెడుతూ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఘన విజయం సాధించడంతో అందర్ని అంచనాలు తలకిందులు అయ్యాయి. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో త్రిష ప్రాభవం మరోసారి మీడియాలో వెలిగిపోయింది. ఆమెను అనధికారికంగా ద్వితీయ పౌరురాలిగా చూడటం మీడియా మొదలుపెట్టింది. తమిళనాడులో త్రిషా పేరు ఉన్నట్టుగా మార్మోగిపోతున్నది.

ఇలాంటి పరిస్థితులు, అనేక వార్తల మధ్య త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్త హైలెట్‌గా నిలిచింది. ఆమెను త్వరలోనే టీవీకే పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించే ఆలోచనలో విజయ్ ఉన్నారు. అలాగే తాను రాజీనామా చేసిన తిరుచ్చి స్థానం నుంచి ఆమెను బరిలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెను ఎన్నికల్లో గెలిపించడమే కాకుండా తన క్యాబినేట్‌లోకి చేర్చుకోవాలనే ప్లాన్ కూడా ఉంది అనే వార్తలు తమిళ మీడియాలోప్రచారం జరుగుతున్నాయి.

అయితే ప్రధాన రాజకీయ పార్టీ డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కూడా విజయ్ సునామీలో ఓటమి పాలయ్యారు. అయితే విజయ్ రాజీనామా చేసే తిరుచ్చి స్థానం నుంచి ఆయన మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే స్టాలిన్‌కు వ్యతిరేకంగా టీవీకే త్రిషను బరిలోకి దించే ప్రయత్నం చేస్తున్నది. ఈ పోటీ నిజంగా ఇలా జరిగి.. ఆ తర్వాత వచ్చే ఫలితం తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించే ఛాన్స్ ఉందనే అభిప్రాయం సాధారణ జనంలోను, పౌరుల్లోను వినబడుతున్నది. త్రిష తిరుచ్చి నుంచి పోటీ చేస్తుందా? స్టాలిన్‌పై విజయం సాధిస్తుందా? అనే ప్రశ్నలకు ఊహజనితమే కావొచ్చు. కానీ తమిళనాడులో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది.

Read more about: trisha krishnan vijay tvk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X