Trisha: రాజకీయాల్లోకి ఎంట్రీపై త్రిష క్లారిటీ.. ఆమె తల్లి సీరియస్​

త్రిష.. ఈ బ్యూటిఫుల్​ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్​కు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. టాలీవుడ్​కు 'వర్షం'లా వచ్చి.. తెలుగు వారి మనసుల్లో 'నువ్​ వస్తానంటే నేనొద్దననంటానా' అన్నట్లుగా ఒక నిండు 'పౌర్ణమి'లా ప్రకాశించింది. 'నీ మనసు నాకు తెలుసు' అని పలు తెలుగు సినిమాల్లో నటించిన త్రిష గతకొంతకాలంగా 'ఆడవారి మాటలకు అర్థాలువేరులే' అన్నట్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే తాజాగా ఆమెపై వచ్చిన ఓ వార్తపై క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి అదెంటో చూద్దామా!

 సినిమాలకు దూరం..

సినిమాలకు దూరం..

తెలుగుతోపాటు తమిళంలోనూ సుమారు అగ్ర హీరోలతో నటించింది త్రిష కృష్ణన్. స్టార్​ ఇమేజ్​ సంపాదించుకున్న త్రిష గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయినా ఇటీవల ఆమె పేరు సోషల్​ మీడియాలో మారుమోగిపోతోంది.

త్రిష క్లారిటీ..

త్రిష క్లారిటీ..

అందుకు ఒక కారణం ఆమె బ్రేకప్​ అయితే మరొకటి త్రిష రాజకీయ రంగప్రవేశం చేస్తుందని. త్రిష ఒక జాతీయ పార్టీలో చేరనుందని, ఓ స్టార్​ హీరో ఆమెకు సహకరిస్తున్నారని జోరుగా వస్తున్న వార్తలపై తాజాగా త్రిష స్పందించారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

అర్థం కావట్లేదు..

అర్థం కావట్లేదు..

ఓ ఇంటర్వ్యూలో త్రిష పొలిటికల్​ ఎంట్రీపై ఆమెను ప్రశ్నించగా.. 'ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో నాకు అర్థం కావట్లేదు. నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం లేదు. అసలు అలాంటి ప్లాన్​ ఏం లేదు' అని సమాధానమిచ్చినట్లు సమాచారం.

త్రిష తల్లి సీరియస్​..

త్రిష తల్లి సీరియస్​..

అలాగే ఈ విషయంపై త్రిష తల్లి ఉమా కృష్ణన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'త్రిష వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంది. తనకు రాజకీయాల్లోకి చేరే ఆలోచిన లేదు. మరిన్ని చిత్రాల్లో నటించేందుకు అగ్రిమెంట్స్​పై సంతకం పెట్టనుంది' అని ఆమె తెలిపారు.

పార్టీలోకి ఆహ్వానించలేదు..

పార్టీలోకి ఆహ్వానించలేదు..

అలాగే త్రిష కాంగ్రెస్​ పార్టీలో చేరతారన్న వార్తలపై అటు ఆ పార్టీ కూడా స్పష్టతనిచ్చింది. త్రిషను తమ పార్టీలోకి ఆహ్వానించలేదని తేల్చి చెప్పింది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల త్రిష 'పరమపదం విలయాట్టు' అనే తమిళ్​ పొలిటికల్​ థ్రిల్లర్​లో నటించింది.

వార్తలు రావండతో..

వార్తలు రావండతో..

ఆ తర్వాతే ఆమె రాజకీయ పార్టీలో చేరనున్నట్లు వార్తలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఆమె తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియన్​ సెల్వన్'​ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

చాలా గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు..

చాలా గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు..

ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్​ 30న చాలా గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతోపాటు మలయాళంలో 'రామ్'​, తమిళ్​లో 'ది రోడ్'​ సినిమాల్లో యాక్ట్​ చేయనుంది త్రిష.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X