నన్ను డీల్ చేయడానికి అదే కరెక్ట్ టైమ్.. బికినీ అందాలతో త్రిష సెన్సేషన్
Recommended Video
సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అందాల తార త్రిష. గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లోని అందరు అగ్రహీరోలతో రొమాన్స్ చేసింది. కెరీర్‌లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న ఈ చెన్నై సుందరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నేటితరం హీరోయిన్లకే ఈర్ష తెప్పిస్తోంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు, ట్యాగ్ చేసిన లైన్ నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి.

మాల్దీవుల్లో చెన్నై బ్యూటీ
సినిమాలతో పాటు తరచూ వెకేషన్స్ ఎంజాయ్ చేసే త్రిష ప్రస్తుతం మాల్దీవుల్లో షికారు చేస్తోంది. అక్కడి బీచ్‌లలో తన అందాలకు పదును పెడుతూ ఫొటోలకు పోజిస్తోంది. కుర్ర హీరోయిన్లకు ఈర్ష కలిగేలా స్విమ్ సూట్‌లో యువతకు గాలం వేస్తోంది. మాల్దీవుల్లోని సముద్రపు ఒడ్డున బికినీలో అలా అలా ఎంజాయ్ చేస్తూ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిష.

నన్ను డీల్ చేయడానికి అదే కరెక్ట్ టైమ్
బికినీ ఫోజుల్లో త్రిష షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 35 ఏళ్ల వయసులో ఉన్న ఈ భామ.. యంగ్ హీరోయిన్స్‌ని మించి వేడి పుట్టిస్తోంది. అయితే తన లోని హాట్‌నెస్ బయటపెట్టిన త్రిష.. ట్యాగ్ లైన్‌తో మరింత అట్రాక్ట్ కలిగించింది. 'తాను హుషారుగా ఉన్నపుడే తనను డీల్ చేయాలనేది తన సలహా' అని పేర్కొంది త్రిష.

అమ్మడి ఫిట్‌నెస్ చూస్తుంటే
మాల్దీవుల్లో దిగిన ఈ తాజా ఫొటోల్లో అమ్మడి ఫిట్‌నెస్ చూస్తుంటే ఇంకో పదేళ్ల పాటు సౌత్ సినిమా హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది. బీచ్ ఒడ్డున గ్రీన్ డ్రెస్‌లో తీసుకున్న సెల్ఫీలో త్రిష అందాలతో పాటు వీపు భాగాన ఉన్న టాటూ ఫోకస్ అవుతోంది. ఈ పిక్స్ ఆమె అందాలను వర్ణిస్తూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. లైకుల వర్షం కురుస్తూ నెట్టింట వైరల్ చేసేస్తున్నారు.

అవకాశాలకు కొదవే లేదు
సీనియర్ భామ త్రిష సినిమా అవకాశాలకు కొదవే లేదు. ఇటీవలే విజయ్ సేతుపతి సరసన నటించిన '96' చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన 'పేట' సినిమాతో అలరించింది. ప్రస్తుతం త్రిష పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఆమె నటించిన హారర్ సినిమా 'గర్జనై' ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











