ఛాన్స్ కొట్టేసిన నయన తార..త్రిష మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఏంటో తెలుసా?
సౌత్ ఇండియా సినిమా దగ్గర ఒక స్టేజికి వచ్చిన తర్వాత కొంతమంది హీరోయిన్స్ అలా పాతుకుపోతారు. కొంతమంది హీరోయిన్స్ సీజనల్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మరికొందరు మాత్రం దశాబ్దాల పాటుగా స్టార్ హీరోస్ తరహా లోనే ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అండ్ మంచి క్రేజ్ తో నిలబడిన వారు ఉంటారు. అలా మన సౌత్ సినిమా
దగ్గర తమిళ్ సహా తెలుగులో కూడా కూడా చాలా మంది కనిపిస్తారు.
అలా తెలుగు సహా తమిళ సినిమా దగ్గర దాదాపు సీనియర్ అండ్ ప్రెజెంట్ స్టార్ హీరోస్ తో కూడా వర్క్ చేసిన హీరోయిన్స్ లో సౌత్ క్వీన్స్ త్రిష అలాగే నయనతార కూడా ఒకరు. మరి నయనతార సహా త్రిషలు హీరోయిన్స్ గానే కాకుండా సోలోగా తమపై లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసే విధంగా తమ మార్కెట్ ని మార్చుకున్నారు.

అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ ఇద్దరి నడుమ ఓ సినిమా ఆఫర్ ఒకరి నుంచి మరొకరికి వెళ్లిందట. మరి ఆ సినిమా ఏదో కూడా కాదు తమిళ్ లో నయనతార నటించిన డివోషనల్ ఎంటర్టైనర్ హిట్ చిత్రం "అమ్మోరు తల్లి" అట. ఈ సినిమా ఆ మధ్య డైరెక్ట్ ఓటిటిలో విడుదల అయ్యింది. తమిళ్ మరియు తెలుగులో కూడా రిలీజ్ కి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు రిలీజ్ కి తీసుకొచ్చారు.
అయితే నిజానికి ఈ సినిమాని త్రిషతో ఆ సినిమా దర్శకుడు అలాగే నటుడు ఆర్ జే బాలాజీ ప్లాన్ చేసుకున్నాడట. మొదటిగా ఈ సినిమాని త్రిషని దృష్టిలో పెట్టుకొనే ప్లాన్ చేయగా అప్పటికి కొన్ని పరిస్థితులు రీత్యా ఆమె ఈ సినిమాని మిస్ చేసుకుంది ఆ తర్వాత నయనతార దగ్గరకి వచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే ఈ సినిమా నయనతార కెరీర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
సో ఈ ఇలాంటి సూపర్ హిట్ ని త్రిష మిస్ చేసుకుంది అని చెప్పాలి. ఇపుడు ఈ సినిమాకి సీక్వెల్ పనులు కూడా నయన్ తోనే జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా విషయంలోనే ఇపుడు తమిళ సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ వార్తలు మరిన్ని వినిపిస్తున్నాయి. ఓ పక్క సీక్వెల్ పనులు జరుగుతుండగా ఇదే కాన్సెప్ట్ తో ఓ హీరో వెర్షన్ లో కూడా సినిమా ప్లానింగ్ లు జరుగుతున్నాయట.

అంటే ఆ సినిమాలో నయనతార అమ్మవారు పాత్రలో కనిపిస్తే మేల్ వెర్షన్ లో ఓ హీరో దేవుని పాత్రలో కనిపించనున్నారట. కాగా దేవుడిగా ఓ స్టార్ హీరోతో దర్శకుడు రచయితా ఆర్ జె బాలాజీ చర్చలు కూడా జరుపుతున్నట్టుగా కూడా తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఆ హీరో ఎవరు ఎవరితో ప్లాన్ చేస్తున్నారు లాంటివి ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఇటీవల అయితే నయనతార భారీ చిత్రం జవాన్ లో కనిపించగా త్రిష ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాలో కనిపించింది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన బిగ్ బడ్జెట్ సినిమా "విశ్వంభర" లో నటిస్తుంది.


Click it and Unblock the Notifications











