Trisha Krishnan Net Worth: విజయ్‌తో రిలేషన్ రూమర్స్.. త్రిష ఆస్తులు ఎన్ని కోట్లంటే..?
Trisha Krishnan Net Worth: గత రెండు దశాబ్దాలుగా దక్షిణాది సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా త్రిష దూసుకుపోతుంది. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. చాలా మంది కొత్త నటీమణులు వచ్చినప్పటికీ, త్రిష క్రేజ్ తగ్గలేదు. అయితే.. గత కొన్ని రోజులుగా త్రిష వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో ఆమెకు సంబంధం ఉందనే ప్రచారం గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరుణంలో త్రిష, విజయ్ కలిసి ఓ పెళ్లి రిసెప్షన్‌లో హాజరయ్యారు. వీరిద్దరూ కనిపించడంతో అభిమానులు పెద్ద ఎత్తున చర్చలు ప్రారంభించారు. కొందరు నెటిజన్లు దీనిని వారి రిలేషన్‌కు 'సాఫ్ట్ లాంచ్' అంటూ కామెంట్లు చేయడం కూడా గమనార్హం.

అయితే ఇప్పటి వరకు త్రిషా లేదా విజయ్ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విజయ్ తన వివాహ జీవితం గురించి కూడా ఎక్కడా స్పష్టంగా స్పందించలేదు. ఈ ఘటన తర్వాత త్రిషా గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం, ఆస్తులు, నెట్ వర్త్ వంటి విషయాలను గూగుల్‌లో పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో త్రిషా పేరు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
హీరోయిన్ త్రిషా 1999లో తమిళ మూవీ 'జోడి'తో నటిగా అడుగుపెట్టింది.'వర్షం' (Varsham) సినిమాతో టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సాధించింది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, అర్థాలే వేరులే, పౌర్ణమి, బుజ్జిగాడు, స్టాలిన్, సైనికుడు, బాడీగార్డ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా త్రిషాను దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌లలో ఒకరిగా నిలబెట్టాయి. ఎన్నో హిట్ సినిమాలతో ఆమె ప్రయాణం అజేయంగా సాగింది. 42 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లతో పోటీపడుతూ సీనియర్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది
త్రిషా నెట్ వర్త్
ఇలా రెండుదశాబ్దాల కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న త్రిష ఆస్తుల పరంగా కూడా తెలివైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది.ఆర్థికంగా కూడా స్థిరపడినట్టు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం 2026 నాటికి ఆమె నెట్ వర్త్ సుమారు రూ.85 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం.ముఖ్యంగా బ్లాక్ బస్టర్ 'పొన్నియిన్ సెల్వన్'తర్వాత, ఆమె తన పారితోషికాన్ని భారీగా పెంచుకుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. త్రిష ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ. 5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట.
సినిమాలతో పాటు బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, ప్రకటనలు, ఈవెంట్లు వంటి వాటి ద్వారా కూడా ఆమె భారీగా ఆదాయం పొందుతున్నారు. ఆమె ఆస్తుల్లో ఖరీదైన బంగ్లాలు, కార్లు, ప్లాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా త్రిషాకు చెన్నైలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిలో లగ్జరీ హౌస్ ఉన్నట్లు సమాచారం. ఆ ఇంటి విలువ సుమారు రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుందట. అదే విధంగా హైదరాబాద్‌లో కూడా ఆమెకు ఒక విలాసవంతమైన బంగ్లా ఉన్నట్లు సమాచారం. దాని విలువ సుమారు రూ.6 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెలుగు చిత్రాల షూటింగ్‌ల కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఆమె అక్కడే ఉంటారని తెలుస్తోంది.
లగ్జరీ కార్ల కలెక్షన్
నటి త్రిషా వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది.అందులో మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (Mercedes-Benz S-Class) వంటి మోస్ట్ లగ్జరీ కారు కూడా ఉంది. ఈ కారు విలువ సుమారు 80 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అదే విధంగా త్రిషా వద్ద బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు ((సుమారు రూ.75 లక్షలు) కూడా ఉంది. అలాగే రేంజ్ రోవర్ ఎవోక్ అనే లగ్జరీ ఎస్యూవీ (సుమారు రూ.60 లక్షలు) కూడా ఆమె వద్ద ఉందని సమాచారం. దీనితో పాటు మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ కారు కూడా ఆమె కార్ల జాబితాలో ఉంది. ఈ కారు ధర సుమారు 63 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇలా విలాసవంతమైన కార్లతో త్రిషా గ్యారేజ్ ప్రత్యేకంగా నిలుస్తోంది.
హీరో విజయ్ తో త్రిషాకు సంబంధాలు ఉన్నాయనే రూమర్స్ వస్తున్న త్రిషా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ వార్తల గురించి కూడా ఆమె మౌనంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన సినీ ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పెళ్లి రిసెప్షన్‌లో త్రిషా, విజయ్ కలిసి కనిపించడంతో మొదలైన ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద టాపిక్‌గా మారింది. అయితే వీరిద్దరూ అధికారికంగా స్పందించే వరకు ఈ వార్తలపై స్పష్టత రావడం కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











