పెళ్లిపై త్రిష కృష్ణన్ క్లారిటీ.. అతనితోనే తాళి కట్టించుకుంట.. కానీ అదొక్కటే భయం!
సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ ఇప్పటికీ బ్యాచిలర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇప్పటికే ఆమె తోటి హీరోయిన్ కాజల్, శ్రియా, జెనీలియా వంటి వారు పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నారు. అయితే త్రిష కృష్ణన్ మాత్రం ఇప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. తన కెరీయర్ ను మాత్రం మరింత జోరుగా నడిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తాజాగా త్రిష కృష్ణన్ తన పెళ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను పెళ్లికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో లేదో చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..
నాలుగు పదుల వయస్సు దాటినా..
1983 మే 4న త్రిష కృష్ణన్ చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి 2012లో చనిపోయాడు. దీంతో ఆమె తల్లి ఉమా కృష్ణన్ నే అండగా నిలిచింది. త్రిష కృష్ణన్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఆమె ఎంతో సహకరించిందని, అన్నింట్లో అండదండగా నిలిచిందని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో త్రిష కృష్ణన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే త్రిష కృష్ణన్ రీసెంట్ గానే 42వ పుట్టిన రోజును జరుపుకుంది. ప్రస్తుతం నాలుగు పదుల వయస్సు దాటినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండటం గమనార్హం.

త్రిష కృష్ణన్ పెళ్లి ఎప్పుడు?
42 వయస్సు వచ్చినా త్రిష కృష్ణన్ ఇప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. గతంలో వ్యాపార వేత్త వరుణ్ మనియన్ తో ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. 2015లోనే నిశ్చితార్థం చేసుకోవడం ఓ ఇంటికి వెళ్లిపోతుందని అందరూ సంతోషించారు. కానీ ఎందుకో పెళ్లి వరకు వెళ్లలేదు. ఎంగేజ్ మెంట్ తోనే ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అయితే త్రిష కృష్ణన్ కు పెళ్లి చేసుకోవడానికి ప్రధానంగా ఓ కారణం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో పెళ్లి, విడాకులు సహజంగా మారాయని, తన పెళ్లి తర్వాత జీవితాన్ని విడాకులతో ముగించాలని లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనకు నచ్చిన వ్యక్తి, అతనితో కలిసి సంతోషంగా నిద్రలేస్తాననే ఆశ కలిగించిన వ్యక్తితో తాళి కట్టించుకుంటానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
10 ఏళ్ల తర్వాత మళ్లీ..
త్రిష కృష్ణన్ తన కెరీయర్ తమిళంలో ప్రారంభించింది. కానీ తెలుగు చిత్రాలతోనే భారీ హిట్స్ అందుకుంది. టాలీవుడ్ లో వర్షం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేను వద్దంటానా, అతడు, స్టాలిన్, బుజ్జిగాడు, కింగ్, నమో వెంకటేశ, బాడీ గార్డ్ వంటి చిత్రాలతో అలరించింది. ఇక పదేళ్లుగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడు మళ్లీ తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది. నెక్ట్స్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'విశ్వంభర'లో నటిస్తున్నది. ఈ చిత్రం 2026లో విడుదల కానుందని తెలుస్తోంది.
త్రిష కృష్ణన్ రాబోయే చిత్రాలు..
చివరిగా త్రిష కృష్ణన్ బ్యాక్ టు బ్యాక్ తమిళ చిత్రాలతో థియేటర్లలో దుమ్ములేపింది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'థగ్ లైఫ్' వంటి చిత్రాలతో అలరించింది. రీసెంట్ గా వచ్చిన కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రం ఆశించిన మేర ఫలితానివ్వలేదు. ఇక నెక్ట్స్ విశ్వంభరతో మంచి రిజల్ట్ ను అందుకోనుందని తెలుస్తోంది. విశ్వంభరతో పాటు కరుప్పు అనే చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











