అల్లు అర్జున్ బండారం బయటపెట్టిన త్రిష.. ప్రైవేటుగా బన్నీ అంతమందితో..

కరోనావైరస్ ముప్పు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో సామాన్యులు, సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. స్వీయ గృహ నిర్బంధంలో తన స్నేహితులు, సన్నిహితులతో మొబైల్ ఫోన్‌లో ముచ్చటిస్తూ కాలాన్ని భారంగా వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అందాల భామ త్రిష తనకు అత్యంత సన్నిహితులైన రానా దగ్గుబాటి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో వీడియో ఛాటింగ్ చేసింది. ఈ సందర్భంగా సినీ, ప్రేక్షక లోకానికి తెలియని అల్లు అర్జున్‌ను సీక్రెట్‌ను బయటపెట్టింది. అదేమిటంటే..

Recommended Video

Trisha Revealed Allu Arjun's Secret Social Media Account
రానా, అల్లు అర్జున్‌తో వీడియో ఛాట్

రానా, అల్లు అర్జున్‌తో వీడియో ఛాట్

స్వీయ నిర్భంధంలో ఏమీ తోచక రానా, అల్లు అర్జున్‌తో వీడియో ఛాటింగ్ చేశాను. వారిద్దరితో మాట్లాడిన తర్వాత మనసు తేలిక పడింది. వారితో వీడియో ఛాటింగ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. మధురమైన చాలా విషయాలను మాట్లాడుకొన్నాం అంటూ వీడియో ఛాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

అల్లు అర్జున్ బండారం ఇలా

అల్లు అర్జున్ బండారం ఇలా

త్రిష ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టుతో అల్లు అర్జున్ బండారం బయటపడింది. ఇప్పటి వరకు అఫీషియల్‌గా ఇన్స్‌టాగ్రామ్‌లో ఒకే అకౌంట్ ఉందని భావించిన ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ షాకిచ్చారు. అయితే ప్రైవేట్‌గా మరో అకౌంట్‌ను కూడా సీక్రెట్‌గా నడుపుతున్నారనే విషయం త్రిషా పోస్టుతో బట్టబయలైంది.

అల్ల అర్జున్‌కు ప్రైవేట్ అకౌంట్

అల్ల అర్జున్‌కు ప్రైవేట్ అకౌంట్

త్రిషా చేసిన పోస్టు ద్వారా @bunny_boy_private అనే మరో అకౌంట్‌ను అల్లు అర్జున్‌ పేరిట ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రైవేట్ అకౌంట్ ద్వారానే త్రిషా లాంటి అత్యంత సన్నిహితులతో అల్లు అర్జున్ టచ్‌లో ఉంటారనే విషయం బయటపడింది. దాంతో అల్లు అర్జున్ సీక్రెట్ వ్యవహారం అనుకోకుండా త్రిష బయటపెట్టడంతో ఫ్యాన్స్‌ ఝలక్ తిన్నారు.

బన్నీ ప్రైవేట్ అకౌంట్‌లో..

బన్నీ ప్రైవేట్ అకౌంట్‌లో..

@bunny_boy_private అనే అల్లు అర్జున్ ప్రైవేట్ అకౌంట్‌లో ఆసక్తికరమైన విషయాలు కనిపించాయి. కేవలం 250 మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 744 పోస్టులు పెట్టినట్టు స్పష్టమైంది. ఈ అకౌంట్‌ను త్రిషా, రానా ఇద్దరు ఫాలో అవుతున్నారనే విషయం చెప్పనక్కర్లేదు.

అల్లు అర్జున్ అఫీషియల్ అకౌంట్‌లో

అల్లు అర్జున్ అఫీషియల్ అకౌంట్‌లో

ఇక ఇన్స్‌టాగ్రామ్‌లో alluarjunonline అనే అల్లు అర్జున్ అఫీషియల్ అకౌంట్‌లో విశేషమైన ఆదరణ ఉంది. ఈ వెరిఫైడ్ అకౌంట్‌ను దాదాపు 6 మిలియన్ల మంది అంటే.. 60 లక్షల మంది వరకు ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్‌ను ఈ అకౌంట్ ద్వారానే ఫాలో అవుతూ ఉండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X