Trisha: 40 ఏళ్ల వయసులోనూ తరగని త్రిష అందం.. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?
హీరోయిన్ త్రిష.. నాలుగు పదుల వయసులోనూ అదే అందం.. అదే అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. సినీ ఇండస్ట్రీలో సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇక త్రిష గురించి మీకు తెలియని విషయాలు.. ఆమె బ్యూటీ అండ్ ఫిట్నెస్ సీక్రెట్, ఆమె అలవాట్లు, ఇష్టాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరోయిన్ త్రిష.. జోడీ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇందులో సిమ్రాన్ కు ఫ్రెండు పాత్రలో నటించింది. అలా మొదలైన త్రిష ప్రయాణం.. తమిళంలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ద్విభాష చిత్రంగా తెరకెక్కిన నీ మనసు నాకు తెలుసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అలా రెండో సినిమా ప్రభాస్ తో కలిసి వర్షం చేసింది. ఇక ఈ సినిమా ఆమెకు మంచి పేరును తీసుకువచ్చింది.

వర్షం సినిమా తర్వాత త్రిషకు వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కొట్టేసింది. వరుసగా తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ.. సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ చిత్రాల్లో త్రిష అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఐశ్వర్య రాయ్ కు ధీటుగా త్రిష ఈ సినిమాలో అందంగా కనిపించింది.

అయితే త్రిష విషయానికి వస్తే.. ఆమె ఎక్కువగా చీరలు, సల్వార్ కమీజ్, లెహంగాలు వంటి సాంప్రదాయ దుస్తులను ధరిస్తుంది. నేటి ఫ్యాషన్ కు తగ్గట్లు ఆమె దుస్తులను ధరించి.. చాలా మంది మహిళలకు స్టైల్ ఐకాన్ గా మారింది. రెడ్ కార్పెట్ ఈవెంట్‌లు మరియు అవార్డు షోల విషయానికి వస్తే.. అందులో కూడా త్రిష వివిధ గ్లామరస్ గౌన్లు, డిజైనర్ డ్రెస్‌లలో కనిపిస్తుంది. ట్రెండ్‌లో ఉంటూనే తన అందం, వ్యక్తిత్వాన్ని పెంచే దుస్తులను ఎంచుకోవడానికే ఆమెకు మక్కువ ఎక్కువ.

ఇక త్రిష డైలీ లైఫ్ విషయానికి వస్తే... సాధారణ జీన్స్, టాప్స్ దుస్తులలో ఉంటుందట. ఇక ఆమె అందం వెనుక రహస్యం ఏంటంటే.. ఆమె మేకప్ వేసుకోవడం కంటే.. సహజంగా ఉండేందుకు ఇష్టపడుతుందని తెలుస్తోంది. త్రిష ఫిట్‌నెస్, ఆరోగ్యం విషయానికి వస్తే... ఆమె ఫిట్‌నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టినున్నట్లు తెలుస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో త్రిష రోజూ ఎక్స్ సైజ్ లు చేస్తుందని సమాచారం. ఆమె ఫిజిక్ అలా ఉండటానికి కారణం వ్యాయమం అని తెలుస్తోంది. నేటి కుర్ర హీరోయిన్స్ కు గట్టి పోటీనిస్తూ... త్రిష తన అందాన్ని కాపాడుకుంటుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లియో. ఇక ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత విజయ్ సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. అంతే కాదు.. మరోవైపు కల్యాణ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న మూవీలో కూడా త్రిషనే హీరోయిన్ గా చేస్తుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్.. త్రిషకు కొడుకుగా నటించనున్నారు.


Click it and Unblock the Notifications











