మహేష్‌ను చూసి అలా సిగ్గుపడ్డా.. అంతకు ముందే ఆయనతో అలాంటి రిలేషన్‌షిప్. త్రిష కామెంట్స్
దక్షిణాది సినీ పరిశ్రమలో త్రిష కృష్ణన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేని హీరోయిన్. గత మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్నారు. దక్షిణాదిలోని అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. ఇప్పటికీ యువ హీరోయిన్లకు ధీటుగా పోటీ ఇస్తున్నారు. అయితే గతంలో ఆమె తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతున్నది. గత ఇంటర్వ్యూలో సూపర్ స్టార మహేశ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహేష్ గురించి త్రిష ఏం చెప్పారంటే?
త్రిషా కృష్ణన్ కెరీర్‌ను జోడి ద్వారా 1999 సంవత్సరంలో తమిళ సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఈ సినిమా తర్వాత ఆమెను వరుసగా సినిమాలు వెతుక్కొంటు వచ్చాయి. నీ మనసు నాకు తెలుసు, వర్షం, గిల్లీ, నువ్వొస్తానంటే వొద్దంటానా? లాంటి సినిమాలు భారీ విజయం సాధించడంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయారు. అప్పటి నుంచి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ వరకు ఆమె స్టార్ హీరోయిన్‌గానే ఇండస్ట్రీలోని టాప్ యాక్టర్లతో నటించారు.

అయితే సినిమా రంగంలోకి రాక ముందే త్రిషాకు మహేష్ బాబుతో పరిచయం ఉంది. వారిద్దరూ చెన్నైలోని ఒకే కాలేజీలో చదువుకొన్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారిద్దరికి పరిచయం ఏర్పడింది. సినిమాల్లోకి రాక ముందే వారికి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత అతడు, సైనికుడు లాంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఉన్న పరిచయం ప్రొఫెషనల్ రిలేషన్‌గా మారింది.
అయితే మహేష్ బాబు గురించి త్రిష చెబుతూ.. నేను ఆయన ఒకే కాలేజీలో చదువుకొన్నాం. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. అలా మేము ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పుడు మేము హాయ్ బై అని అనుకొనే ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉండేది. కానీ మేమిద్దరం యాక్టర్లుగా మారి.. కలిసి నటిస్తామని ఊహించలేదు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది అని త్రిష చెప్పారు.
అయితే షూటింగులో మహేష్ బాబు కష్టపడే తత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాను. సెట్స్‌లో చాలా కూల్‌గా ఉండేవాడు. ఆయన హార్డ్ వర్కర్. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా షూటింగ్ చేస్తూనే ఉండేవాడు. ఏ మాత్రం విసుగు చూపించకుండా ఉండేవాడు. ఆయన డెడికేషన్ చూసి నాకు అలాంటి తత్వం లేదని బాధపడటమే కాకుండా బ్యాడ్‌గా ఫీలయ్యాను. ఆయన కష్టపడే తత్వాన్ని చూసి కొన్నిసార్లు సిగ్గుతో తల వంచుకోవాల్సి వచ్చింది అని త్రిషా చెప్పారు.
సాధారణం హీరోలు తమ సీన్ షూటింగ్ చేసిన తర్వాత వెంటనే కార్‌వాన్‌లోకి వెళ్లిపోతారు. కానీ మహేష్ అలాంటి వాడు కాదు. తన సన్నివేశాలు షూట్ అయిన తర్వాత కార్‌వాన్‌లోకి వెళ్లకుండా సెట్‌లోని ఉండి.. మానిటర్‌లో ఇతర నటీనటులు చేసే యాక్టింగ్‌ను చూస్తుండే వారు. షూటింగులో ఉపయోగించే టెక్నిక్‌ను నేర్చుకొనే వారు అని త్రిషా చెప్పింది.


Click it and Unblock the Notifications











