బ్రేకప్ రూమర్లకు తెర దించిన త్రిష.. విజయ్‌తో మిడ్‌నైట్ పార్టీ జోరుగా

తమిళ సీఎం, దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా తన తొలిపుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నారు. అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పండుగలా ఆయన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిందే. అయితే ఆయన పుట్టిన రోజు కావడంతో త్రిష, విజయ్ డేటింగ్ వ్యవహారంపై ఎక్కువ సినీ అభిమానులు, ఫ్యాన్స్ దృష్టిపెట్టారు. అయితే ఆ రోజంతా త్రిష తన ప్రియుడికి ఎలాంటి పుట్టిన రోజు శుభాకాంక్షలు గానీ తెలియకపోవడంతో రూమర్లు గుప్పుమన్నాయి. త్రిష, విజయ్ రిలేషన్‌షిప్ బ్రేకప్ అయింది అంటూ జోరుగా గాసిప్స్ షికారు చేశాయి. అయితే జూన్ 23వ తేదీన ఈ రూమర్లు తెగ వైరల్ కావడంతో వాటికి పుల్ స్టాప్ పెట్టడానికి విజయ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దాంతో త్రిష తన బాయ్‌ఫ్రెండ్‌తో సెలబ్రేట్ చేసుకొన్న విషయం స్పష్టమైంది. ఈ రూమర్లకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

విజయ్ తన భార్య సంగీతతో వైవాహిక విభేదాల నేపథ్యంలో త్రిషతో డేటింగ్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. తమిళనాడు ఎన్నికలకు ముందు భార్య విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడమే కాకుండా తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. దాంతో కొద్ది రోజుల క్రితం విజయ్, త్రిష వెకేషన్ ఫోటో వైరల్ కావడంతో భార్య చేసిన ఆరోపణలన్నీ త్రిష వైపే చూపించాయి. భార్య ఆరోపణలు తర్వాత త్రిష, విజయ్ మరింత దగ్గరయ్యారు. సీఎంగా గెలిచిన తర్వాత ఆయనతో మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు.

Trisha Krishnan Shares Birthday celebration photo with Vijay

అయితే ఇటీవల తమిళనాడులో ఓ వార్త మరో ట్విస్టు ఇచ్చింది. త్రిష, సంగీత ఇద్దరు రాజీ పడ్డారు. కలిసి జీవించడానికి మధ్యవర్తులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన కోర్టు విచారణకు హాజరు కాలేదు అనే మరోసారి గాలి వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో విజయ్ బర్త్ డే రావడం త్రిష మౌనంగా ఉండటంతో వారి బ్రేకప్ అంశానికి ఆజ్యం పోసింది.

Also Read
Peddi OTT Release: పెద్ది ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? రాంచరణ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే? </a><a class='intertextlink' href='https://telugu.filmibeat.com/heroine/trisha-krishnan-shares-birthday-celebration-photo-with-vijay-goes-trending-in-instagram-172645.html' target='_blank'>
Peddi OTT Release: పెద్ది ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? రాంచరణ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

విజయ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత జూన్ 23వ తేదీన విజయ్ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ నుంచి త్రిషా అన్‌ఫాలో అయింది. ఇక వారి డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్ జర్నీ ముగిసింది అనే వార్తలు మీడియాలో స్వైర విహారం చేశాయి. అయితే వార్తలు ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో పొగలు గక్కడంతో త్రిష సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చిన్నపాటి షాక్‌ను గట్టిదెబ్బతో కొట్టింది.

Recommended For You
BreakUp: ధనుష్‌తో మృణాల్ థాకూర్ బ్రేకప్.. కారణం ఏమిటంటే?
BreakUp: ధనుష్‌తో మృణాల్ థాకూర్ బ్రేకప్.. కారణం ఏమిటంటే?

విజయ్‌ బర్త్ డే గురించి పోస్ట్ పెడుతూ.. అన్ని రకాలుగా విలువైన మనిషికి అర్హత .. హ్యాపీ బర్త్ డే అంటూ లవ్ సింబల్‌తోపాటు విజయ్‌తోపాటు ఆయన ముందు పెట్టిన కేక్, ఐస్ క్రీమ్, ఇతర తినుబండారాలు ఫోటోను షేర్ చేసింది. జూన్ 21వ తేదీ మిడ్ నైట్ పార్టీ చేసుకొన్న విషయాన్ని తనదైన శైలిలో తెలిపింది. ఆ పోటోను చూసిన దళపతి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. మాకు ఈ విషయం ఫుల్లుగా సంతోషం. కొందరికి మాత్రం విషాదం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా విజయ్‌తో తన బంధాన్ని లైవ్‌గా మార్చేసి.. రూమర్లకు తెర దించింది.

Read more about: trisha krishnan vijay instagram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X