ముఖం చాటేసిన త్రిషా కృష్ణన్.. విజయ్ కోసం జన నాయగన్ థియేటర్లలో..!

దళపతి విజయ్ నటించిన చిట్ట చివరి సినిమా జన నాయగన్ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాదిలో తన స్టార్ ఇమేజ్‌తో కొట్లాది మంది అభిమానులను సంపాదించుకొన్నారు. తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీకే అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన తర్వాత కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హెచ్ వినోద్ దర్శకత్వంలో చివరి సినిమాను పూర్తి చేశారు. అయితే సెన్సార్ సమస్యల్లో చిక్కుకోవడం, అలాగే పైరసీకి గురై సినిమా మొత్తం లీక్ అయి అభిమానులను షాక్ గురి చేసింది.

అయితే అభిమానుల భావోద్వేగాల మధ్య ఈ సినిమాను వీక్షిస్తూ కంటతడి పెట్టుకొంటూ తన అభిమాన హీరోకు భారంగా వీడ్కోలు పలికారు. తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ సందర్బంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రతీ థియేటర్‌ను అందంగా ముస్తాబు చేసి తిరునాళ్లుగా మార్చేశారు. అయితే ఇలాంటి ఎమోషన్స్ మధ్య జన నాయగన్ సినిమాను సినియర్ నటి త్రిషా కృష్ణన్ తన స్నేహితులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Trisha Krishnan Jana Nayagan

జన నాయగన్ సినిమా దక్షిణాది రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాను చూడటానికి తమిళనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ తారలు పోటెత్తారు. వారిలో త్రిషా కృష్ణన్ కూడా ఉన్నారు. చెన్నైలోని ఓ థియేటర్‌లో తన స్నేహితులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆమెను మీడియా వెంబడించారు.

అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు త్రిషా కృష్ణన్ ముభావంగా సమాధానాలు ఇచ్చారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన త్రిషాను జాతీయ మీడియా పలకరించింది. ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలు ఏంటని ప్రశ్నిస్తే.. లుకింగ్ ఫార్వర్డ్ అంటూ సమాధానం ఇచ్చారు. అయితే మీడియా ఆమెను వెంబడిస్తూ ఈ సినిమా ఎలా ఉంది? మీరు సినిమా చూసి ఎలా ఫీలయ్యారు? అంటూ అడిగిన ప్రశ్నలకు ఆమె ముఖం చాటేశారు. సమాధానాలు చెప్పకుండా హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఇదిలా ఉండగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ భార్య విడాకుల కోసం కోర్టుకు ఎక్కడం వివాదంగా మారింది. ఆ వ్యవహారంలో త్రిషతో విజయ్‌కు వివాహేతర సంబంధం చర్చనీయాంశమైంది. ఆ సందర్భంగా వారిద్దరి బంధంపై అనేక ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. విజయ్ కోసం ఓటు వేయడం, అలాగే ఎన్నికల ఫలితాల రోజున తిరుపతి దర్శించుకోవడం, ఆ తర్వాత విజయ్‌ను కలుసుకోవడం ఆసక్తికరమైన పరిణామాలుగా మారాయి. ఇక వీజయ్ సీఎంగా పదవి స్వీకారం కార్యక్రమానికి త్రిషా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X