‘మళ్లీ ప్రేమలో పడుతా.. కానీ పెళ్లి చేసుకోను.. అలాంటి బంధం నాకొద్దు’

తమిళ, దక్షిణాది సినీ, రాజకీయ రంగాల్లో గట్టిగా ట్రెండ్ అవుతున్న పేర్లలో స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు ఒకటి. తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో సహజీవనం చేసున్నట్టు వార్తల నేపథ్యంలో ఆమె పేరు మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నది. టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్‌తో వైవాహిక జీవితం సవ్యంగా సాగడం లేదు. నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఆయన భార్య సంగీత మద్రాస్ కోర్టును ఆశ్రయించడం, ఆ పిటిషన్‌లో నా భర్తకు సినీ హీరోయిన్‌తో వివాహేతర సంబంధం ఉంది అంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

అయితే విజయ్ భార్య ఆరోపించిన హీరోయిన్ త్రిషా అంటూ సోషల్ మీడియాలోను, మీడియాలో వాడివేడి చర్చ జరిగింది. ఆ వార్తలకు బలం చేకూరేలాగా త్రిష, విజయ్ కలిసి ఓ నిర్మాత ఇంటిలో పెళ్లికి హాజరుకావడం వారిద్దరి బంధం తేటతెల్లం అయింది. అయితే ఈ క్రమంలో త్రిషా చేసిన కామెంట్స్, పాత ఇంటర్వ్యూలు వైరల్ అవుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. త్రిషా చేసిన కామెంట్స్ విషయంలోకి వెళితే..

Trisha Krishnan about on Love Marriage and Divorce

త్రిషాకు, దక్షిణాదిలో పలువురు హీరోలతో డేటింగ్, అఫైర్, రిలేషన్‌షిప్ అంటూ వార్తలు వచ్చాయి. వాటన్నింటిని పక్కన పెట్టి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లికి ముందు ఊహించిన విధంగా ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయింది. దాంతో ఆమె బ్రేకప్ కారణం ఓ హీరోనే అంటూ కామెంట్స్ వినిపించాయి.

అయితే ఆ వార్తలను ఖండిస్తూ.. నా బ్రేకప్ వ్యవహారానికి మరొకరిని నిందించకూడదని చెప్పారు. తన పెళ్లి ఆగిపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు.బయటకు చెప్పడానికి వ్యక్తిగత కారణాలు అడ్డు వస్తున్నాయి. నా వ్యక్తిగత విషయాలను పబ్లిక్ చేయలేను. నా ప్రైవసీకి భంగం కలిగించకూడదు అంటూ ఆమె చెప్పారు. దాంతో ఆ కథకు అలా పుల్‌స్టాప్ పెట్టారు.

ఆ తర్వాత త్రిషా ఓ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహారం గురించి చేసిన అభిప్రాయాలు మరోసారి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. నాకు మరోసారి ప్రేమలో పడాలని ఉంది. కానీ ప్రేమిస్తాను. ఇష్టపడుతాను. కానీ సమాజ కట్టుబాట్లను, ఎవరినో మెప్పించడానికి నేను పెళ్లి చేసుకోను. నాకు తెలిసిన చాలా మంది వైవాహిక బంధంలో అంసతృప్తితో ఉన్నారు. వారు నాకు చెప్పినదేమిటంటే.. మ్యారేజ్‌కు కమిట్ అయ్యి.. ఆ తర్వాత సవ్యంగా సాగకపోవడంతో విడాకులు తీసుకొనే పరిస్థితులను బేరిజు వేసుకొని నిర్ణయం తీసుకో అని చెప్పారు. పెళ్లి తర్వాత అభిప్రాయ బేధాలతో విడాకులు తీసుకొని బాధపడటం నాకు ఇష్టం లేదు అని ఆమె అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

త్రిషా కెరీర్ విషయానికి వస్తే.. 2025లో ఐడెంటిటీ, విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సూర్యతో కరుప్పు చిత్రంలో, చిరంజీవితో విశ్వంభర సినిమాలో, అలాగే జీతూ జోసెఫ్, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో వస్తున్న రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: trisha krishnan vijay sangeetha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X