నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నా... ఎన్నికల ఫలితాలకు ముందు త్రిష షాకింగ్ పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. టీవీకే అధినేత, దళపతి విజయ్‌తో త్రిష రిలేషన్‌లో ఉన్నారని త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో వీరిద్దరి బంధం హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్.. త్రిష- విజయ్ బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో త్రిషకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
అయితే ఇంతలోనే దళపతి విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కలకలం రేపింది. విడాకుల కారణాలలో తన భర్త విజయ్‌కి సినీరంగానికి చెందిన ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది జరిగిన కొద్దిరోజులకే త్రిష- విజయ్ ఒకే కారులో జంటగా ఓ వివాహ కార్యక్రమానికి హాజరుకావడం సంగీత ఆరోపణలకు బలం చేకూర్చింది. విడాకుల కేసుపై ప్రస్తుతం చెంగల్పట్టు కోర్టులో విచారణ జరుగుతోంది.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా త్రిష వ్యవహారశైలి చర్చనీయాంశం అయ్యింది. పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన త్రిష.. సిరా గుర్తు ఉన్న వేలిని మీడియాకు చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేయని త్రిష.. ఇంటికెళ్లిన తర్వాత ఓ పాటను బ్యాక్‌డ్రాప్‌లో పెట్టి ఫోటోను షేర్ చేశారు. త్రిషతో విజయ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ హిట్ గిల్లి సినిమాలోని అర్జునర్ విల్లు అనే పవర్‌ఫుల్ సాంగ్‌ను పోస్ట్ చేశారు. మామూలుగా అయితే ఈ సాంగ్ గురించి ఎలాంటి డిస్కషన్ నడిచేది కాదు. కానీ అర్జునర్ విల్లు సాంగ్ మధ్యలో వచ్చే విజిల్ శబ్ధం అప్పట్లో బాగా పాపులర్. ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే ఎన్నికల గుర్తు విజిల్ కావడంతో తాను టీవీకే ఓటు వేశానని త్రిష ఇలా హింట్ ఇచ్చినట్లుగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
అయితే విజయ్- త్రిష రిలేషన్‌పై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరైతే త్రిష నటనకు గుడ్‌బై చెబుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ కొద్దిరోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై త్రిష సినిమాలలో కొనసాగాలని అనుకోవడం లేదు. కొత్తగా ఏ ప్రాజెక్ట్‌కూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దీనిపై కొందరు నిర్మాతలను సంప్రదించానని చిత్రా లక్షణన్ పేర్కొన్నారు. ఆయన అల్లరి చిల్లరి వ్యాఖ్యలు చేసే మనిషి కాదని.. పక్కా సమాచారం ఉంటేనే మాట్లాడతారని అంటున్నారు.
విజయ్- త్రిషల మధ్య రిలేషన్ నడుస్తోందంటూ గాసిప్స్ వస్తున్న క్రమంలో త్రిష ఏం మాట్లాడినా? ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా త్రిష పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె నిద్ర గురించి పేర్కొన్నారు. ఒక గంట నిద్రను కోల్పోతే.. దానిని రివకరీ చేయడానికి 4 రోజులు పడుతుంది. నా లెక్క ప్రకారం 2062లో నేను సంతోషంగా ఉంటానంటూ త్రిష పోస్ట్ పెట్టారు. ఇది కాస్తా వైరల్ అవుతుండగా.. త్రిష ఏం చెబుతుందో అర్ధంకాక నెటిజన్లు బుర్రలు గొక్కుంటున్నారు. అయితే త్రిషకు రాత్రిళ్లు సరిగా నిద్రపట్టదు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. అందుకే 96 అనే మూవీని దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ మూవీని రాత్రిళ్లు షూటింగ్ చేశారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు రిలీజ్‌కు ముందు త్రిష పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది.


Click it and Unblock the Notifications