Trisha: ముఖ్యమంత్రిగా విజయ్.. త్రిష కృష్ణన్ ఫస్ట్ రియాక్షన్ ఏమిటో తెలుసా?

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఉన్న అనిశ్చితి ముగిసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. లోక్ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం స్వీకరించారు. ఈ సందర్భంగా సినీ నటి త్రిషా కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే విజయ్‌తోపాటు ఆమె ఈ వేడుకలో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు త్రిషపైనే అందరి కళ్లు పడ్డాయి. ఈ వేడుకలో త్రిష మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. అయితే విజయ్ గురించి, కొత్త ప్రభుత్వం గురించి మీడియా గుచ్చి గుచ్చి అడిగిన ప్రశ్నలకు ఆమె సింపుల్‌గా సమాధానం ఇచ్చి తప్పించుకొన్నారు. త్రిష వెల్లడించిన రియాక్షన్ వివరాల్లోకి వెళితే..

దళపతి విజయ్‌తో ఆయన సతీమణి సంగీత దాంపత్య పరమైన విభేదాలు గత కొద్ది నెలలుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ సమయంలో విజయ్ భార్య ఓ హీరోయిన్ కారణంగా మా వైవాహిక జీవితం దారి తప్పింది అంటూ ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయితే అప్పటికే త్రిష, విజయ్ రిలేషన్‌షిప్ గురించి లీకులు రావడంతో సంగీత టార్గెట్ చేసింది ఎవరు అనే విషయంపై అనుమాన పడాల్సిన అవసరం లేకపోయింది.

Trisha Krishnan s first Reaction after Vijay Oath

విజయ్, త్రిషా వివాహేతర బంధంపై ఓ వైపు రాజకీయ, సినీ వర్గాల్లో భారీగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తమిళ నిర్మాత ఇంట్లో జరిగిన వివాహానికి ఇద్దరు ఒకే కారులో వచ్చి హాజరు కావడంతో వారిద్దరి రిలేషన్ ఏమిటో అనే విషయంపై వివరణ ఇచ్చుకోకుండా తేటతెల్లం చేశారు. దాంతో వారిద్దరి బంధానికి అధికారికంగా రాజముద్ర పడినంత పనైంది.

Also Read
త్రిషాకు మొండిచేయి.. ఆశలపై నీళ్లు చల్లిన విజయ్!
త్రిషాకు మొండిచేయి.. ఆశలపై నీళ్లు చల్లిన విజయ్!

అయితే తమిళ ఎన్నికల సమయంలోను, ప్రచారం హోరు కొనసాగుతుంటే త్రిష తనదైన స్థాయిలో విజయ్‌కు అండగా నిలిచారు. సోషల్ మీడియాలో నర్మగర్భమైన ట్వీట్లు, ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టులు పెడుతూ అందర్నీ ఆకర్షించారు. ఓ వైపు ఫలితాలు వెలువడే సమయానికి తన జన్మదినం రోజున తిరుమలలో ప్రత్యక్ష్యమై మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఆ తర్వాత విజయ్‌ని కలిసి శుభాకాంక్షలు అందించి ఆయన నివాసం నుంచి వెళ్లిపోయారు.

Recommended For You
బాలకృష్ణతో అలాంటి అనుభవం.. సెట్‌లో నాతో ఆ రోజు అలా.. ఊర్వశి రటేలా
బాలకృష్ణతో అలాంటి అనుభవం.. సెట్‌లో నాతో ఆ రోజు అలా.. ఊర్వశి రటేలా

ఇక గత కొద్దికాలంగా ప్రభుత్వ ఏర్పాటులో చోటు చేసుకొన్న అనిశ్చితి నేపథ్యంలో త్రిష సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. మీడియాను తనవైపుకు తిప్పుకొంటూ ప్రాధాన్యం పెంచుకొన్నారు. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో మెరిశారు. విజయ్ కుటుంబ సభ్యులతో మమేకమై కనిపించారు. ఈ వేడుక జరుగుతున్నంత సేపు మహా ఉత్సాహంతో కనిపించారు.

You May Also Like
Trisha: ముఖ్యమంత్రిగా విజయ్.. త్రిష కృష్ణన్ ఫస్ట్ రియాక్షన్ ఏమిటో తెలుసా?
Trisha: ముఖ్యమంత్రిగా విజయ్.. త్రిష కృష్ణన్ ఫస్ట్ రియాక్షన్ ఏమిటో తెలుసా?

విజయ్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత టైమ్స్ నౌ మీడియా ఆమె వెంట పడి ప్రశ్నల వర్షం కురిపించింది. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ రియాక్షన్ ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కంగ్రాటులేషన్. సూపర్ హ్యాపీ అని అన్నారు. తమిళ ప్రజల కోసం మీరు ఇచ్చే సందేశం ఏమిటంటే.. యస్.. యస్.. వారికి నా కంగ్రాట్స్ అంంటూ వేగంగా వెళ్లిపోయారు. త్రిష రియాక్షన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నది.

Read more about: trisha krishnan vijay tvk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X