Trisha Remuneration: త్రిష కృష్ణన్ రెమ్యునరేషన్ ఎంత? కరుప్పు కోసం పారితోషికం ఎన్ని కోట్లంటే?

దక్షిణాదిలోనే కాకుండా ఉత్తర భారతీయ మీడియాలోను సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ టాప్ ట్రెండింగ్‌లో ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన ఈ అందాల భామ గురించి అంతా చర్చ జరుగుతున్నది. దళపతి విజయ్ ప్రియురాలిగా ముద్ర వేసుకొన్న ఆమె ప్రస్తుతం సినీ, రాజకీయ రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. ఇలాంటి సమయంలో ఆమె నటించిన కరుప్పు సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను త్రిష తీసుకొన్న రెమ్యునరేషన్ ఎన్ని కోట్లనే వివరాల్లోకి వెళితే..

గ్లామర్ పాత్రలతోనే కాకుండా పెర్ఫార్మెన్స్‌ రోల్స్‌తో త్రిష గత రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు. తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగాల్లోని అగ్ర హీరోలతో నటించడమే కాకుండా లేడీ ఓరియెంట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొన్నారు. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకొన్న హీరోయిన్‌గా గుర్తింపు పొందారు.

Trisha Krishnan s Remuneration

తమిళంలో స్టార్ హీరో సూర్యతో కలిసి ప్రస్తుతం త్రిష కరుప్పు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఆమె పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. కథలో భాగంగా ప్రధాన పాత్రను పోషించారనే విషయం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌గా సినిమాకు మారింది. అయితే ఈ చిత్రంలో సూర్యతోనే కాకుండా దర్శక, నటుడు ఆర్జే బాలాజీ పోటీపడి నటించారనే విషయం ఈ సినిమాకు పాజిటివ్‌గా మారింది.

కరుప్పు చిత్రంలో అందం, అభినయానికి స్కోప్ ఉన్న పాత్రల్లో త్రిష నటించారు. ఆమె ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు సానుకూలంగా మారుతుంది. ఈ చిత్రంలో ఆమె నటించినందుకు సుమారుగా 5 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకొన్నారు. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం అందుకొంటున్న హీరోయిన్లలో త్రిష ఒకరు. గత 20 ఏళ్లుగా స్టార్ డమ్‌ను కొనసాగిస్తున్న ఆమెకు నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు అంటూ సినీ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, త్రిష త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్త సంచలనంగా మారింది. విజయ్ రాజీనామా చేయనున్న తిరుచ్చి స్థానం నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనే ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అయితే ఈ విషయంపై టీవీకే పార్టీ నుంచి గానీ, త్రిష, విజయ్ నుంచి గానీ ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఈ రూమరు మరింత ఆసక్తికరంగా మారింది.

త్రిషా కెరీర్ విషయానికి వస్తే.. విజయ్‌తో కలిసి లియో, గోట్ చిత్రాల్లో నటించిన తర్వాత.. అజిత్‌తో కలిసి విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ చిత్రాల్లో నటించింది. సూర్యతో కరుప్పు, చిరంజీవితో విశ్వంభర, మలయాళ చిత్రం రామ్‌లో సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో కలిసి నటిస్తున్నారు.

Read more about: trisha krishnan Karuppu suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X