For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  త్రిష పెళ్లిపై సెన్సేషనల్ న్యూస్ లీక్: చేసుకోబోయేది అతడినే.. సీక్రెట్‌గా నడిపించడానికి కారణమిదే

  |

  తెలుగులోకి హీరోయిన్‌గా ప్రవేశించిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది చెన్నై చిన్నది త్రిష. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను దక్కించుకున్న ఈ భామ.. ప్రత్యేకమైన శైలితో దూసుకుపోయింది. ఫలితంగా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. ఈ మధ్య కోలీవుడ్‌కే పరిమితమైన ఈ బ్యూటీ.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా త్రిష వివాహం గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  చిన్న వయసులోనే అలా మొదలైన ప్రయాణం

  చిన్న వయసులోనే అలా మొదలైన ప్రయాణం

  చాలా చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది తమిళ అమ్మాయి త్రిష. తండ్రి లేకున్నా తల్లి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి అడుగు పెట్టిన ఈ భామ.. గ్లామర్ ఫీల్డులో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని సత్తా చాటింది. ఫలితంగా అప్పుడే మిస్ మద్రాస్‌గా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును అందుకుని హవా చూపించింది.

  టీనేజ్‌లోనే యాక్టింగ్.. తెలుగులోకి అలా ఎంట్రీ

  టీనేజ్‌లోనే యాక్టింగ్.. తెలుగులోకి అలా ఎంట్రీ

  మోడలింగ్ రంగంలో ఉన్న సమయంలో అంటే టీనేజ్‌లోనే త్రిష 'జోడీ' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత సూర్య హీరోగా వచ్చిన 'మౌనం పెసియాదే'లో హీరోయిన్‌గా మారింది. అనంతరం 'నీ మనసు నాకు తెలుసు' అనే ద్విభాషా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. 'వర్షం'తో మొదటి బ్రేక్‌ను అందుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది.

  అతడితో లవ్ ట్రాక్.. వివాహానికి ముందు బ్రేకప్‌

  అతడితో లవ్ ట్రాక్.. వివాహానికి ముందు బ్రేకప్‌

  వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైంది. వీళ్లిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. సరిగ్గా ఆ సమయంలో వరుణ్.. త్రిషను ఉద్దేశించి 'పతిత' అని ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.

  ఆ హీరోలతో త్రిష డేటింగ్.. హాట్ టాపిక్ అయింది

  ఆ హీరోలతో త్రిష డేటింగ్.. హాట్ టాపిక్ అయింది

  కెరీర్ పరంగా ఎంతటి కీర్తిని గడించిందో.. అంతే స్థాయిలో రూమర్లను కూడా ఎదుర్కొంది త్రిష. సుదీర్ఘమైన ప్రయాణంలో ఆమె చాలా మంది హీరోలతో డేటింగ్ చేసిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఆమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌, ఆ తర్వాత దగ్గుబాటి రానాతో డేటింగ్ చేస్తుందని కూడా ప్రచారం జరిగింది. తెలుగు హీరోలే కాదు.. కోలీవుడ్ స్టార్ల పేర్లూ తెరపైకి వచ్చాయి.

  ఇప్పుడా స్టార్‌తో ప్రేమ.. పెళ్లి చేసుకోబోతుందని

  ఇప్పుడా స్టార్‌తో ప్రేమ.. పెళ్లి చేసుకోబోతుందని

  కొద్ది రోజులుగా త్రిష పెళ్లి గురించే రెండు ఇండస్ట్రీల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు అందరూ మూడు ముళ్లు వేయించుకుంటుండగా.. ఆమె కూడా దానికి సిద్ధం అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో శింబుతో త్రిష ప్రేమాయణం సాగిస్తుందని, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా టాక్ వినిపించింది.

  త్రిష పెళ్లిపై వార్తలు.. ఆమె ఊహించని రియాక్షన్

  త్రిష పెళ్లిపై వార్తలు.. ఆమె ఊహించని రియాక్షన్

  ఆ మధ్య తన పెళ్లి గురించి మీడియాతో మాట్లాడిన త్రిష.. 'నా పెళ్లి ఎప్పుడు అనేది నాకే తెలియదు. నేను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాను. నాకు సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నా సినిమాలు నేను చేసుకుంటాను. అదే సమయంలో నాకు కాబోయే వాడి కోసం అన్వేషిస్తుంటాను. దీనికి త్వరలోనే ముగింపు పలుకుతాను' అంటూ వివరణ ఇచ్చేసింది.

  Recommended Video

  Will Saranga Dariya Be Another Rowdy Baby For Sai Pallavi ?
  చేసుకోబోయేది అతడినే.. సీక్రెట్‌గా వ్యవహారం

  చేసుకోబోయేది అతడినే.. సీక్రెట్‌గా వ్యవహారం

  త్రిష పెళ్లి గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. దీనికి సంబంధించిన పనులను సీక్రెట్‌గా జరుపుతున్నారని కోలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీనికి కారణం గతంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలే అని తెలుస్తోంది. ఇక, త్రిష చేసుకోబోయేది ఓ యంగ్ బిజినెస్‌మ్యాన్‌ను అని కూడా ఓ న్యూస్ లీకైంది.

  English summary
  Trisha Krishnan, known mononymously as Trisha, is an Indian film actress and model, who primarily works in Tamil and Telugu language films. She was noticed after winning several beauty pageants like the Miss Madras contest, which marked her entry into filmdom.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X