ఆ డైరెక్టర్‌తో హీరోయిన్ త్రిష పెళ్లి: ఇద్దరి మధ్య అలా మొదలైన ప్రేమ.. ముందే బయటకొచ్చిన మేటర్

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో దాదాపు పదిహేనేళ్లుగా దక్షిణాది మొత్తంలో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ త్రిష. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న ఈ భామ.. అన్ని భాషల్లోనూ సత్తా చాటింది. అదే సమయంలో వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది. కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఈ హీరోయిన్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం పలు ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొంది. ఇక, ఈ మధ్య కాలంలో తరచూ త్రిష పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కాబోయే భర్త వివరాలు లీకయ్యాయి. ఆ డీటేల్స్ మీకోసం!

టీనేజ్‌లోనే మొదలైన త్రిష ప్రయాణం

టీనేజ్‌లోనే మొదలైన త్రిష ప్రయాణం

టీనేజ్‌లోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది తమిళ అమ్మాయి త్రిష. తండ్రి లేకున్నా తల్లి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి అడుగు పెట్టిన ఈ భామ.. గ్లామర్ ఫీల్డులో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని సత్తా చాటింది. ఫలితంగా అప్పుడే మిస్ మద్రాస్‌గా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును అందుకుని ఎంతో మంది దృష్టిలో పడింది.

 అలా ప్రవేశం... తెలుగులో అడుగులు

అలా ప్రవేశం... తెలుగులో అడుగులు

మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే త్రిష 'జోడీ' అనే సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత సూర్య హీరోగా వచ్చిన 'మౌనం పెసియాదే'లో హీరోయిన్‌గా మారింది. అనంతరం 'నీ మనసు నాకు తెలుసు' అనే ద్విభాషా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. 'వర్షం'తో మొదటి బ్రేక్‌ను అందుకుంది. అప్పుడే టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది

 అతడితో ప్రేమ... వివాహానికి ముందు

అతడితో ప్రేమ... వివాహానికి ముందు

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైంది. వీళ్లిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. సరిగ్గా ఆ సమయంలో వరుణ్.. త్రిషను ఉద్దేశించి 'పతిత' అని ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే.

 హీరోలతో త్రిష డేటింగ్.. పలువురి పేర్లు

హీరోలతో త్రిష డేటింగ్.. పలువురి పేర్లు

కెరీర్ పరంగా త్రిష ఎంతో సక్సెస్ అయింది. అంతే స్థాయిలో ఆమె డేటింగ్ రూమర్లను కూడా ఎదుర్కొంది. సుదీర్ఘమైన ప్రయాణంలో ఆమె చాలా మంది హీరోలతో డేటింగ్ చేసిందన్న వార్తలు వచ్చాయి. మొదట్లో ఆమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌, ఆ తర్వాత దగ్గుబాటి రానాతో డేటింగ్ చేస్తుందని కూడా ప్రచారం జరిగింది. తెలుగు హీరోలే కాదు.. కోలీవుడ్ స్టార్ల పేర్లూ వైరల్ అయ్యాయి.

హాట్ టాపిక్‌గా త్రిష పెళ్లి.. క్లారిటీ లేదు

హాట్ టాపిక్‌గా త్రిష పెళ్లి.. క్లారిటీ లేదు

తన ఏజ్ హీరోయిన్లంతా ఎప్పుడో పెళ్లి చేసుకున్నా.. త్రిష మాత్రం ఇంకా మూడు ముళ్లు వేయించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పలు ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి ఆమె ఎన్నో కామెంట్లు చేసింది. దీంతో ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ పెళ్లి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తరచూ ఆమె వివాహం గురించి ఏదో ఒక న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

ఆ డైరెక్టర్‌తో పెళ్లి... అలా పుట్టిన ప్రేమ

ఆ డైరెక్టర్‌తో పెళ్లి... అలా పుట్టిన ప్రేమ

తాజాగా త్రిష పెళ్లి గురించి ఓ న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ బ్యూటీ త్వరలోనే ఓ తమిళ దర్శకుడిని పెళ్లాడబోతుందట. వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల క్రితం ఓ సినిమా చేస్తోన్న సమయంలో ప్రేమ చిగురించిందని అంటున్నారు. అంతేకాదు, త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. ఆ తర్వాత ఏడడుగులు నడవాలని భావిస్తున్నట్లు ఓ న్యూస్ బయటకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X