అతడినే చేసుకుంటాను.. అప్పటి వరకూ అదే పని: పెళ్లిపై త్రిష సంచలన ప్రకటన

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు తన హవాను చూపించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది హాట్ బ్యూటీ త్రిష. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. పరిస్థితులు తారుమారు కావడంతో టాలీవుడ్‌ను వదిలేసి మిగిలిన దక్షిణాది భాషల్లో సినిమా చేస్తోంది. తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోన్న త్రిష.. ప్రేమాయణం విషయంలో ఈ మధ్య హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి సంచలన ప్రకటన చేసిందామె. ఆ వివరాలు మీకోసం.!

మోడలింగ్‌లో సత్తా.. ఎన్నో అవార్డులు సొంతం

మోడలింగ్‌లో సత్తా.. ఎన్నో అవార్డులు సొంతం

తమిళనాడు రాష్ట్రానికి చెందిన త్రిష.. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. అయినా తల్లి సహకారంతో చదువును విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. ఇలా చేస్తున్న సమయంలోనే మిస్ మద్రాస్‌గా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో ‘మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును అందుకుంది.

చిన్న వయసులోనే ఎంట్రీ.... తెలుగులో ఇలా

చిన్న వయసులోనే ఎంట్రీ.... తెలుగులో ఇలా

నటనపై ఉన్న ఆసక్తితో చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించింది త్రిష. ‘జోడీ' అనే మూవీలో చిన్న పాత్రను పోషించిన ఆమె.. సూర్య హీరోగా వచ్చిన ‘మౌనం పెసియాదే'లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ‘నీ మనసు నాకు తెలుసు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది.

ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్థం.. వెంటనే బ్రేకప్

ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్థం.. వెంటనే బ్రేకప్

కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిష వివాహం ఖరారైంది. వీళ్లిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఆ సమయంలో వరుణ్.. త్రిషను ఉద్దేశించి ‘పతిత' అని ట్విట్టర్‌లో చేసిన పోస్టు ఎన్నో అనుమానాలకు తావిచ్చింది.

హీరోలతో ఎఫైర్స్.. అలా బయటకు వచ్చాయి

హీరోలతో ఎఫైర్స్.. అలా బయటకు వచ్చాయి

సుదీర్ఘమైన సినీ కెరీర్‌‌లో త్రిష పలువురు హీరోలతో ప్రేమాయణం సాగించినట్లు పలుమార్లు ప్రచారం జరిగింది. కెరీర్ ఆరంభంలో ఆమె ప్రభాస్‌తో డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత దగ్గుబాటి రానాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. సరిగ్గా అదే సమయంలో సుచీ లీక్స్‌లో వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటో లీక్ అవడం కలకలం రేపింది.

స్టార్ హీరోతో ప్రేమాయణం.. పెళ్లికి సిద్ధమైంది

స్టార్ హీరోతో ప్రేమాయణం.. పెళ్లికి సిద్ధమైంది

సీనియర్ హీరోయిన్లు ఒక్కొక్కరుగా వివాహాలు చేసుకుంటుండడంతో ఇప్పుడు అందరి దృష్టి త్రిష పైనే పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరో శింబుతో త్రిష ప్రేమాయణం సాగిస్తుందని, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

Recommended Video

Actor Prakash Raj's Green India Challenge | Praised CM KCR
అతడినే చేసుకుంటాను: పెళ్లిపై త్రిష ప్రకటన

అతడినే చేసుకుంటాను: పెళ్లిపై త్రిష ప్రకటన

తన పెళ్లి విషయంలో జరుగుతోన్న ప్రచారంపై త్రిష తాజాగా స్పందించింది. ‘నా పెళ్లి ఎప్పుడు అనేది నాకే తెలియదు. నేను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాను. నాకు సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నా సినిమాలు నేను చేసుకుంటాను. అదే సమయంలో నాకు కాబోయే వాడి కోసం అన్వేషిస్తుంటాను. దీనికి త్వరలోనే ముగింపు పలుకుతాను' అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X