మైక్ దొరికితే ఏదైనా వాగుతావా? సీనియర్ నటుడిని దుమ్ము దులిపిన త్రిష
Trisha Krishnan: దక్షిణాది సినీ పరిశ్రమలో గత రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న నటి త్రిష కృష్ణన్. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. చాలా మంది కొత్త నటీమణులు వచ్చినప్పటికీ, త్రిష క్రేజ్ తగ్గలేదు. అయితే, గత కొన్ని రోజులుగా త్రిష వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా త్రిష చేసిన సోషల్ ఓ పోస్ట్ సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎవరిపేరూ నేరుగా ప్రస్తావించకపోయినా వివాదస్పదంగా మరింది. ఇంతకీ ఏమన్నారంటే?
అసలేం జరిగిందంటే?
ఇటీవల చెన్నైలో జరిగిన గలట్టా అవార్డ్స్ కార్యక్రమంలో ఈ వివాదం ప్రారంభమైంది. ఆ కార్యక్రమంలో స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో ఆర్.పార్థిబన్‌కు ఆయనతో కలిసి పనిచేసిన నటీనటుల గురించి ప్రశ్నలు అడిగారు. అదే సమయంలో స్క్రీన్‌పై త్రిష ఫోటో కనిపించడంతో ఆమె గురించి వ్యాఖ్యానించమని కోరారు. దానికి స్పందించిన పార్థిబన్ 'ఈ కుందవై కొంతకాలం ఇంట్లోనే ఉండాలి. బయటకు వస్తే ఎక్కడ లేని సమస్యలు వస్తున్నాయి' అని వ్యాఖ్యానించారు.

పొన్నియిన్ సెల్వన్' సినిమాలో త్రిష పోషించిన పాత్ర పేరు 'కుందవై' కావడంతో ఆయన ఆ పేరుతోనే సెటైర్ వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్న కొంతమందిని నవ్వించినప్పటికీ, తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.
త్రిష స్ట్రాంగ్ కౌంటర్
ఈ వ్యాఖ్యలపై త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో పరోక్షంగా స్పందించారు. 'మైక్ చేతిలో ఉందని చేసే ప్రతి వ్యాఖ్య తెలివైనదిగా లేదా సరదాగా మారదు. అలా మాట్లాడటం వల్ల కేవలం మూర్ఖత్వం మరింత గట్టిగా వినిపించడమే జరుగుతుంది. ఎవరి గురించి పూర్తిగా తెలియకుండా అసభ్యకరంగా మాట్లాడటం సరికాదు. ఆ వ్యక్తి గురించి కాకుండా మాట్లాడిన వారి సంస్కారం గురించి ఎక్కువగా చెబుతుంది' అని ఆమె వ్యాఖ్యానించారు.త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు పార్థిబన్ వ్యాఖ్యలకు ప్రత్యక్ష సమాధానంగా భావిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించసాగారు.
పార్థిబన్ క్షమాపణ
ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్థిబన్ కూడా స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే దానికి తాను పశ్చాత్తాపం చెందుతున్నానని చెప్పారు. ఈ సంఘటనను తాను తప్పుగా అర్థం చేసుకున్నానని, ఇకపై ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటానని పేర్కొన్నారు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా పుల్ స్టాప్ పడినట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఒక నటితో విజయ్‌కు సంబంధం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయాలపై త్రిష లేదా విజయ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ తన వ్యక్తిగత సమస్యలను తానే పరిష్కరించుకుంటానని, అభిమానులు ఆ విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.


Click it and Unblock the Notifications











