Thalapathy Vijay- Trisha: అన్ని సమస్యలకు కారణం నువ్వే... త్రిషపై స్టార్ హీరో దారుణమైన కామెంట్స్
దక్షిణాది సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు దళపతి విజయ్, త్రిష. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో రిలేషన్ ఉందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. ఇటీవల విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. విడాకులు కోరడానికి కారణాలలో ఓ ప్రముఖ సినీ నటితో తన భర్తకున్న వివాహేతర సంబంధాన్ని ప్రస్తావించారు. దాంతో అందరిచూపు త్రిషపై పడింది. ఈ క్రమంలోనే త్రిష- విజయ్‌లు ఓ వివాహ కార్యక్రమానికి జంటగా హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విజయ్- త్రిషలపై నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రముఖులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా త్రిషపై సీనియర్ నటుడు పార్ధిబన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...
జంటగా త్రిష- విజయ్
గత కొంతకాలంగా త్రిష- విజయ్ రిలేషన్‌పై తమిళ చిత్ర పరిశ్రమ అట్టుడుకుతుండగా.. చెన్నైలో జరిగిన వివాహ వేడుకకు త్రిషతో కలిసి విజయ్ జంటగా ఒకే కారులో ఆ కార్యక్రమానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. వేదికపై భార్యాభర్తల మాదిరిగా కొత్త జంటను ఆశీర్వదించిన వీరిద్దరూ.. ఫోటోలకు ఫోజులిచ్చారు. దాంతో త్రిషతో తన బంధాన్ని ఇన్‌డైరెక్ట్‌గా విజయ్ బయటపెట్టేశారా? సంగీతకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారా? అంటూ సినీవర్గాలు, మీడియాలో చర్చ నడుస్తోంది.

విజయ్‌కి షాకిచ్చిన సంగీత
ఆ వెంటనే గంటలు తిరక్కుండానే విజయ్ సతీమణి సంగీత మరో షాకిచ్చారు. తన భర్త తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ చెంగల్పట్టు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. కోట్లాది రూపాయలు సంపాదించే విజయ్ ఇంట్లో నాకు స్థానం లేదు.. చెన్నై రోడ్లపై నేను నిరాశ్రయురాలిని అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. బ్రిటీష్ పౌరసత్వం ఉన్న తాను లండన్ నుంచి చెన్నై వస్తే.. నగరంలోని నీలంకరైలో ఉన్న నివాసంలోకి విజయ్ రానివ్వడం లేదని సంగీత ఆరోపించారు. విజయ్‌తో విడాకుల పంచాయతీ తేలే వరకు తాను ఈ ఇంట్లోనే ఉండేలా తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సంగీత తన పిటిషన్‌లో కోరారు.
వాటిని నేను చూసుకుంటా
త్రిషతో రిలేషన్ రూమర్స్, సంగీత విడాకుల నోటీసుపై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న టీవీకే చీఫ్ విజయ్.. ఎట్టకేలకు స్పందించారు. తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న విషయాల సంగతి నేను చూసుకుంటాను. పార్టీ, ప్రజా సమస్యల పరిష్కారంపై మీరు పోరాడండి అని టీవీకే శ్రేణులకు దళపతి పిలుపునిచ్చారు. ఆయన స్పందనపై సినీ, రాజకీయ వర్గాలు రకరకాలుగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్ధిబన్ స్పందించారు.
అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా
అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన పార్ధిబన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. రజనీ, కమల్, విజయ్ కాంత్ , విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలు ఏలుతున్న సమయంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. కే. భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన పార్ధిబన్.. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించడంతో పాటు 16 చిత్రాలకు దర్శకుడిగా, 14 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి కోలీవుడ్ అగ్రనటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగువారిని కూడా పార్ధిబన్ పలకరించాడు. ముఖ్యంగా యుగానికి ఒక్కడులో చిత్రంలో మహారాజుగా ఆయన నటన ఆకట్టుకుంది.
ఆమెను ఇంట్లో కూర్చోమనండి
సినిమాలు, షూటింగ్స్‌తో పాటు పలు అంశాలపై పార్ధిబన్ స్పందిస్తుంటారు. ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన త్రిష - దళపతి విజయ్ వ్యవహారంపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఓ అవార్డ్ ప్రదానోత్సవానికి హాజరైన పార్ధిబన్‌ను త్రిష గురించి మీ అభిప్రాయం చెప్పాల్సిందిగా యాంకర్ కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ.. పొన్నియన్ సెల్వన్‌లో త్రిష పోషించిన కుందవై పేరుతో ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కుందవై (త్రిష) కొన్నాళ్లు ఇంట్లోనే కూర్చుంటే మంచిది. ఆమె బయట అడుగుపెట్టడం చాలా సమస్యలకు కారణమవుతోంది అంటూ పార్ధిబన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనిపై త్రిష ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications


















