దుబాయ్‌లో త్రిష.. డాల్ఫిన్లతో జలకాలట. వైరల్‌గా మారిన ఫొటోలు
దక్షిణాది అందాల తార త్రిష షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం దుబాయ్‌లో విహారయాత్ర చేస్తున్నది. త్వరలోనే విజయ్ సేతుపతితో కలిసి నటించిన 96 చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ దొరకగానే వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ డాల్ఫిన్ చేపలతో ఎంజాయ్ చేస్తూ సమయాన్ని గడిపింది. ఆ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
దుబాయ్‌లో కొన్ని రోజులు ఉండి 96 సినిమా ప్రమోషన్ కోసం తిరిగి రానున్నది. ఈ చిత్రం అక్టోబర్ 4న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్‌కు రిలీజ్‌కు ముందే మంచి ఆదరణ లభిస్తున్నది.

ప్రస్తుతం కోలీవుడ్‌లో సెన్సేషన్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న పెట్ట చిత్రంలో త్రిషా నటిస్తున్నది. ఈ చిత్రం రజనీకాంత్, కార్తీ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా నటిస్తున్నారు.
ఈ చిత్రాల కంటే ముందు మోహిని అనే చిత్రంలో త్రిష చివరిసారిగా నటించింది. వయసు మీద పడుతున్న కొద్ది ఆమె చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉండటం గమనార్హం. గార్జనై, శతురంగ వెట్టై2, 1818 చిత్రాల్లో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











