విజయ్‌తో రిలేషన్ రూమర్స్‌.. త్రిష స్ట్రాంగ్ వార్నింగ్

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు తరుచు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా త్రిష, తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ జోసెఫ్‌ల మధ్య ఉన్న స్నేహం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇద్దరూ పలుమార్లు కలిసి కనిపించడం, వేడుకలు, పబ్లిక్ ఈవెంట్లలో హాజరుకావడం కారణంగా వారిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు విజయ్ గానీ, త్రిష గానీ అధికారికంగా స్పందించలేదు.

ఇటీవల తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ తల్లి మరణించడంతో ఆమెకు నివాళులు అర్పించేందుకు విజయ్ వెళ్లారు. ఈ సందర్భంగా త్రిష కూడా ఆయనతో కలిసి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియోలు కొత్త వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో త్రిష ప్రయాణించారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కొంతమంది నెటిజన్లు ఈ అంశంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Trisha s Strong Warning Amid Vijay Relationship Rumours Viral Post Sparks Fresh Debate

ప్రభుత్వ వనరులు, అధికారిక సౌకర్యాలను ఉపయోగించుకునే హక్కు ప్రజాప్రతినిధులకు లేదా అధికారులకు మాత్రమే ఉంటుందని, ఒక సినీ నటి అధికారిక కాన్వాయ్‌లో ప్రయాణించడం సరైనదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరికొందరు విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే మరోవైపు ఈ విమర్శలను ఖండించే వర్గం కూడా ఉంది.

విజయ్, త్రిష ఇద్దరూ దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కలిసి పనిచేస్తున్నారని, అజిత్ కుటుంబం విషాదంలో ఉన్న సమయంలో సానుభూతి తెలిపేందుకు వెళ్లడాన్ని అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత స్నేహాన్ని వివాదంగా మార్చడం సరైంది కాదని, సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దూషణలు అనవసరమని పేర్కొంటున్నారు.

అయితే.. తాజాగా .. ఈ వివాదంపై త్రిష చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ మరింత ఆసక్తి రేకెత్తించింది. తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేస్తూ "నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను" అంటూ క్యాప్షన్ పెట్టారు. నేరుగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించకపోయినా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్స్‌కు ఇదే సమాధానమని ఆమె అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా మే నెల ముగింపు సందర్భంగా త్రిష మరో పోస్టుతో వార్తల్లో నిలిచారు. "ఈ ఏడాది మే నెలను తలచుకున్నప్పుడల్లా నా ముఖంపై చిరునవ్వు వస్తుంది" అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ "మ్యాజికల్ మే" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

త్రిష అభిమానుల అభిప్రాయం ప్రకారం.. మే నెల ఆమెకు అనేక కారణాల వల్ల ప్రత్యేకమైంది. ఈ నెలలోనే ఆమె పుట్టినరోజు జరుపుకున్నారు. అదే సమయంలో ఆమె నటించిన 'కరుప్పు' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా విజయ్ రాజకీయ జీవితంలో కీలకమైన విజయాలు కూడా ఇదే సమయంలో నమోదయ్యాయి. దీంతో త్రిష పేరు సోషల్ మీడియాలో మరింతగా ట్రెండ్ అయింది.

ప్రస్తుతం విజయ్-త్రిష బంధంపై వస్తున్న ప్రచారం ఎంతవరకు నిజమన్నది స్పష్టత లేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేకపోయినా, ఇద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తుండటంతో ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు ప్రజా జీవితంలో ఉన్న ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతోంది. ఈ వివాదాలపై విజయ్ లేదా త్రిష భవిష్యత్తులో ఏదైనా స్పష్టమైన వివరణ ఇస్తారా? లేక ఇప్పటిలాగే మౌనం పాటిస్తారా? అనే ఆసక్తి అభిమానులతో పాటు రాజకీయ, సినీ వర్గాల్లో కూడా నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X