మరీ ఇంతగా చింపుకోవాలా? రకుల్ ప్రీత్ డ్రెస్ మీద విమర్శలు
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయింది. ఫ్యాషన్ వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో ఈ డ్రెస్ రుజువు చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరైతే బెగ్గర్స్ ఇంతకంటే మంచి డ్రెస్సులు వేస్తారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు మనం చిరుగుల జీన్స్ చూశాం. ఒకప్పుడు వాటిపై విమర్శలు వచ్చినా... ఇపుడు అవే ఫ్యాషన్ అయిపోయాయి. యూత్ అంతా ఇపుడు చిరుగుల జీన్స్ ఇష్టపడి కొనుక్కుంటున్నారు. అయితే రకుల్ వెరైటీగా చిరుగల షర్ట్ వేసుకుని దర్శనిమిచ్చింది.

ముందు వైపు కాలర్ క్రింది భాగంలో చిరుగులు పెట్టి కాస్త వెగటు పుట్టించే విధంగా ఈ డ్రెస్ డిజైన్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అలా రకుల్ ఈ పోస్టు కారణంగా విమర్శలపాలైంది.
సినిమాల విషయానికొస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో సూర్య 'ఎన్జీకే'తో పాటు కార్తీ మూవీలో, శివ కార్తియేయన్ హరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు హిందీలో 'దే దే ప్యార్ దే'లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











