అలా బట్టలు విప్పేసిన శ్రీదేవి కూతురు.. బూతు కామెంట్లతో స్టార్ కిడ్ కు చురకలు

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. అతిలోక సుందరి, సీనియర్ నటి, దివంగత శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే జాన్వీ కపూర్ కూడా తన తల్లి పోలికలతో ఉండటంతో అంతటి కీర్తిని, గౌరవాన్ని పొందుతుందని అంతా భావించారు. కెరీర్ లోనూ ఉన్నత స్థాయికి వెళ్తుందని శ్రీదేవి అభిమానులు కోరుకున్నారు. కానీ జాన్వీ కపూర్ మాత్రం తమకు షాక్ ఇచ్చిందని మండిపడుతున్నారు.

జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషనల్ గా హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంలో నటించి మెప్పించింది. తన నటనతో దక్షిణాది ప్రేక్షకులను ఫిదా చేసింది. మరోవైపు డ్యాన్స్ లోనూ ఎన్టీఆర్ కు ధీటుగా పెర్ఫామెన్స్ ఇచ్చి థియేటర్లలో విజిల్స్ వేయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ 'చుట్టమల్లే' సాంగ్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. దాంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో మరిన్ని బిగ్ ప్రాజెక్ట్స్ ను కూడా సొంతం చేసుకుంటోంది.

Trolling on Sridevi Daughter Janhvi Kapoor

సినిమాలతోనే కాకుండా జాన్వీ కపూర్ మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు. అలాగే సినిమా ఈవెంట్లు, ఫ్యాషన్ వీక్ కాంపిటీషన్లలోనూ పాల్గొంటూ ఆకట్టుకుంటూ ఉంటోంది. ఈ క్రమంలో రీసెంట్ గా లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో పాల్గొంది. బ్లాక్ బాడీకాన్ డ్రెస్, ఆపైన స్టైలిష్ లాంగ్ లెన్త్ బ్లేజర్ ధరించి కనిపించింది. ఇక ర్యాంప్ వ్యాక్ లో భాగంగా, ఆ బ్లేజర్ ను తీసేస్తూ ఫొటోలకు ఘాటుగా ఫోజులిచ్చింది. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

అయితే తల్లి శ్రీదేవి గతంలో సినిమా ఫంక్షన్లో కూడా ఇలానే పై దుస్తులు తీసేస్తూ డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఆ రెండు వీడియోలను పక్కపక్కన పెట్టి కంపేర్ చేస్తూ ఓ నెటిజన్ వీడియోను షేర్ చేశారు. దీంతో శ్రీదేవి పక్కన జాన్వీ కపూర్ చూసిన ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ శ్రీదేవిలో జాన్వీ కపూర్ 1% కూడా పోటీకి రాదని చెప్పుకొచ్చారు. నటనలోనూ శ్రీదేవిని అందుకోవాలంటే ఇంకా కష్టపడాలని, ఇలా ఎక్స్ పోజింగ్స్ తో పని అవ్వదని నేరుగా మాట్లాడేస్తున్నారు.

గతంలోనూ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో వదిలిన బోల్డ్ ఫొటోలపైనా శ్రీదేవి ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆమె తీరు మార్చుకోవాలని సూచించారు కూడాను. గొప్ప నటి కడుపులో పుట్టినప్పటికీ ఆమె లక్షణాలు రాలేదని, ఇకనైనా పద్దతి మార్చుకోవాలని అప్పుడు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నుంచి జాన్వీ పద్ధతిగానే కనిపిస్తూ తన అభిమానులను ఖుషి చేస్తున్నారు. మరోవైపు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ల్లో అవకాశాలు దక్కించుకుంటూ సెన్సేషన్ గా మారుతోంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ లో జాయిన్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X