రిపబ్లిక్ డే రోజున బుక్కైన అనసూయ: టీ షర్ట్‌పై ఆయన బొమ్మ.. అలా కూర్చుని కనిపించడంతో!
అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ భామ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సత్తా చాటుతూ దూసుకుపోతోంది. అంతేకాదు, అందంతో పాటు నటనతోనూ మెప్పిస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ఇలా వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటోంది. దీంతో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ చేసింది. దీంతో అనసూయపై నెటిజన్లు ఫైర్ అవుతూ ట్రోల్ చేస్తున్నారు. వీటికి ఆమె కూడా రిప్లై ఇచ్చింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ కోసం!
Recommended Video

అలా మొదలై జబర్ధస్త్‌గా కెరీర్
సినిమాల్లోకి రావడానికి ముందే అనసూయ యాంకర్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. జబర్ధస్త్ షో ద్వారా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపును దక్కించుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఫలితంగా తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు నడుపుకుంటూ హవా చూపిస్తోంది.

సినిమాల్లోనూ అనసూయ సత్తా
సుదీర్ఘ కాలంగా యాంకర్‌గా సత్తా చాటుతోన్న అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తనదైన శైలి నటనతో మెస్మరైజ్ చేస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయన'తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘క్షణం', ‘రంగస్థలం', ‘యాత్ర', ‘కథనం', ‘పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. ఈ క్రమంలోనే కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసి ఫిదా చేసేసింది.

అనసూయ చేస్తున్న మూవీలు
గతంలో మాదిరిగా అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. అయితే, ఆమె ఇప్పుడు ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే గత ఏడాది ‘థ్యాంక్యూ బ్రదర్', ‘పుష్ప'లో సందడి చేసింది. అలాగే, ‘రంగమార్తాండ', ‘వేదాంతం రాఘవయ్య', ‘ఖిలాడీ', ‘హరిహర వీరమల్లు', ‘పుష్ప 2' వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ తెగ సందడి చేస్తోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ
చేతి నిండా షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అనసూయ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

రిపబ్లిక్ డేకు స్పెషల్ రీల్ చేసి
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ భరద్వాజ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రీల్స్ చేస్తూనే ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఈ భామ.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ రీల్ చేసింది. అందులో వందేమాతరం పాటను ఆలపించింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది.

అనసూయపై నెటిజన్లు ట్రోల్స్
అనసూయ చేసిన రిపబ్లిక్ డే రీల్‌కు ఎక్కువగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఇందులో ఆమె వందేమాతరం గీతాన్ని కూర్చుని ఆలపించింది. అలాగే, ఆమె వేసుకున్న టీ షర్ట్‌పై మహాత్మ గాంధీ బొమ్మ ఉంది. దీంతో ‘గాంధీకి రిపబ్లిక్ డేకు సంబంధం ఏంటి' అని కొందరు.. ‘కూర్చుని పాటను పాడతావా' అంటూ మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

సారీ చెప్పి అలా రిప్లై ఇచ్చింది
నెటిజన్లు చేసిన కామెంట్లను చూసిన అనసూయ.. వాటికి సమాధానం చెప్పి ఆ స్క్రీన్‌షాట్లను స్టోరీగా పెట్టుకుంది. అందులో కూర్చుని పాడినందుకు అందరికీ సారీ చెప్పింది. అయితే, గాంధీ బొమ్మ ఉండడంపై మాత్రం ‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే రిపబ్లిక్ డే వచ్చింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని అయినా మాట్లాడుర్రి' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందామె.


Click it and Unblock the Notifications











