లెజెండరీ నటితో పోలికా? శ్రీలీలపై దారుణంగా ట్రోల్స్!
మామూలుగా తెలుగు సినిమా నుంచి హీరోయిన్ రావడమే అనేది ఇపుడు గగనం అయ్యిపోయింది. ఒకవేళ వచ్చినా కూడా వారికి సరైన అవకాశాలు కూడా ఉండడం లేదు. ఇలా తెలుగు నుంచి కేవలం కొంతమంది మాత్రమే హీరోయిన్స్ గా ఉండగా వారిలో మాత్రం ఓ రేంజ్ లో సక్సెస్ సాధించిన యువ నటి ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల అని చెప్పవచ్చు.
తన డెబ్యూ సినిమాతోనే మంచి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఒక టైం లో టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా కూడా మోస్ట్ బిజీ హీరోయిన్ గా నిలిచింది. అలాగే ఇపుడు మరిన్ని సినిమాల్లో తాను నటిస్తుండగా ఒక సరైన హిట్ కోసం ఆమె ఎదురు చూస్తుంది. కాగా శ్రీలీలకి అందానికి అందం, నటన కూడా బాగానే ఉన్నాయి. కానీ తనపై కొన్ని అంశాల్లో మాత్రం పలు ట్రోల్స్ లేకపోలేవు.

తన ఏజ్ కి మించిన పాత్రలు లేదా సినిమాలు చేస్తుండడంతో ఆమె సూట్ కావడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పాన్ ఇండియా సినిమాని షేక్ చేసిన భారీ చిత్రం పుష్ప 2 ది రూల్ లో కూడా కిస్సిక్ సాంగ్ ని చేసింది కానీ అల్లు అర్జున్ పక్కన చిన్న పిల్లలా ఉందని సామ్ రేంజ్ లో ఇంప్రెస్ చెయ్యలేకపోయింది అనే కామెంట్స్ కూడా లేకపోలేవు. ఇక వీటి తర్వాత మరోసారి ఈ యంగ్ బ్యూటీపై పలు ట్రోల్స్ సోషల్ మీడియాలో కొనసాగుతున్నాయి.
కాగా శ్రీలీల నుంచి ఇపుడు తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ్ నుంచి కూడా ఎంట్రీ ఉన్నట్టుగా ఇపుడు రీసెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది. కాగా శ్రీలీల తన మొదటి తమిళ్ సినిమాగా హీరో శివ కార్తికేయన్ తో సాలిడ్ ప్రాజెక్ట్ "పరాశక్తి"లో కనిపించింది. కానీ ఈ సినిమాలో శ్రీలీల కనిపించిన లుక్ కొంచెం డిఫరెంట్ గా అనిపించగా ఈ లుక్ తో ఏకంగా చాలా మంది మహానటి సావిత్రి గారితో పోలుస్తున్నారు.

దీనితో అక్కడ నుంచి తనపై సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోల్స్ మొదలయ్యాయి. లుక్స్ లోనే కాదు ఏ అంశంలో కూడా సావిత్రి గారితో పోలికేంటి అని ఓ రేంజ్ లో శ్రీలీలపై ఇపుడు ట్రోల్స్ పడుతున్నాయి. అయితే ఇందులో తన తప్పేమి లేదు కానీ కొందరు నెటిజన్స్ అత్యుత్సాహం మూలాన ఆమెపై విమర్శలు తప్పడం లేదు.
మరి ఈ సినిమాలో శ్రీలీల ఎలా అలరిస్తుందో చూడాలి. ఇక ఇపుడు తమిళ్ లోనే కాకుండా హిందీ సినిమాలో కూడా తాను నటించేందుకు సిద్ధం అయ్యింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ వారసుడు సినిమాతో అయితే శ్రీలీల ప్రస్తుతం హిందీలో ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా టాక్. కాగా దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.


Click it and Unblock the Notifications











