twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క సినిమా.. 11 అవార్డులు.. ఆనందంలో హీరోయిన్

    |

    దశాబ్దంపైగా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా సత్తాచాటిన త్రిష.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలన్న తేడా లేకుండా అందరికీ జంటగా నటించింది. చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లాంటి సీనియర్ హీరోలతోనే కాకుండా మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్‌లతోనూ జట్టు కట్టింది. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మంచి హిట్లు అందుకుంది. మళ్లీ చాలా ఏళ్ల తరువాత త్రిష హవా కొనసాగుతోంది.

    ఒక్క చిత్రంతో అంతా మారింది..

    ఒక్క చిత్రంతో అంతా మారింది..

    త్రిష, శ్రియాలాంటి హీరోయిన్ల కాలం చెల్లిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే త్రిష మాత్రం మళ్లీ మునుపటి కంటే ఫుల్ బిజీగా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. గతేడాది వచ్చిన 96 సినిమా ఎంతటి సంచలనాలను నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో త్రిష ఫేట్ మారిపోయింది.

    సెకండ్ ఇన్నింగ్స్..

    సెకండ్ ఇన్నింగ్స్..

    2018 అక్టోబర్ 4న రిలీజైన 96 చిత్రం.. ఇక కెరీర్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో కమ్ బ్యాక్ అయ్యేందుకు సహకరించిన చిత్రమిది. త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌కు మంచి బాట వేసింది. అందరినీ ఆకట్టుకునేలా.. ఫీల్ గుడ్ కథతో.. వాస్తవిక కోణంలో తెరకెక్కించాడు దర్శకుడు సి.ప్రేమ్ కుమార్.

    జాను పాత్రలో త్రిష..

    ఇందులో జాను పాత్రలో నటించిన త్రిషపై విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రశంసలతో పాటు ఈ సినిమా త్రిషకు అత్యధిక అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి నిన్నటి ఫిల్మ్ ఫేర్ వరకు త్రిష మొత్తం 11 అవార్డులని ఈ సినిమాతో సొంతం చేసుకోవడం ఒక రికార్డు.

    ఆనందంలో త్రిష..

    ఆనందంలో త్రిష..

    96 చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్‌ని సొంతం చేసుకున్న ఆనందంలో ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న త్రిష తనకు `96` చిత్రం ద్వారా వచ్చిన అవార్టుల ను వరుసలో పెట్టి అందరూ చూసేలా ప్రదర్శనకు పెట్టింది. అంతేకాకుండా హే జ్యూడ్ అనే చిత్రానికి మరో మూడు అవార్డుల వచ్చినట్టు తెలిపింది.ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్- సమంత జంటగా నటిస్తుండగా..దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

    English summary
    Trsiha Got 11 Awards For 96 Movie. She Played Jaanu Character In 96 Movie. C Prema Kumar Directed This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X