Divorce Alimony: హన్సిక మోత్వానీ విడాకుల్లో షాకింగ్ ట్విస్టులు.. భరణం ఎన్ని కోట్లంటే?
సినిమా పరిశ్రమను ఓ వైపు హీరోలు, హీరోయిన్ల పెళ్లి వార్తలు జోష్ కలిగిస్తుంటే.. మరో వైపు సెలబ్రిటీల విడాకుల వార్తలు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ విజయ్ దంపతుల విడాకుల వ్యవహారం మీడియాలో పెద్ద రచ్చ చేస్తుంటే.. తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించిన హన్సిక మోత్వానీ తన భర్తతో విడాకులు తీసుకోవడం ఆమె అభిమానులకు, సినీ ప్రేక్షకులకు షాకింగ్ వార్తగా మారింది. అయితే హన్సిక దాంపత్య జీవితంలో షాకింగ్ విషయాలు, ట్విస్ట్ అంశాల వివరాల్లోకి వెళితే..
తమిళ ఇండస్ట్రీతోపాటు దక్షిణాది సినిమా పరిశ్రమలో హన్సిక మోత్వానీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో పలువురు హీరోలతో అఫైర్ అంటూ అనేక రూమర్లు వచ్చాయి. కానీ ఆ వార్తలకు భిన్నంగా అప్పటికే తన స్నేహితురాలిని వివాహం చేసుకొన్న సోహైల్ ఖతురియా అనే వ్యాపారవేత్తను, వివాహితుడిని పెళ్లి చేసుకోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. అయితే తన స్నేహితురాలితో సోహైల్ వివాహానికి హాజరైన హన్సిక.. ఆ తర్వాత తన ఫ్రెండ్ భర్తను వివాహం చేసుకోవడం ట్విస్టుగా మారింది.

అయితే గత నాలుగేళ్లుగా సోహైల్‌తో హన్సిక వైవాహిక జీవితం సవ్యంగా సాగినట్టు కనిపించింది. ఉన్నట్టుంది ఆమె తన ఇన్స్‌టాగ్రామ్ నుంచి తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు, భర్తతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో వారిద్దరూ సపరేట్ అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. వారి దాంపత్య జీవితం విచ్చినవుతున్నదనే వార్తల మధ్య హన్సిక పెట్టిన పోస్టు వైరల్ అయింది.
హన్సిక తన 34వ జన్మదినం సందర్భంగా ఎమోషనల్ లేఖను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అత్యంత నిజాయితీగా, గ్రాట్యిట్యూడ్‌తో ఫీల్ అవుతున్నాను. లవ్‌లో మునిగిపోయాను. కేక్‌తో నా జన్మదిన ఆహ్లాదకరంగా మారింది. ఈ లిటిల్ మూమెంట్స్‌కు కారణమైన అందరికీ థ్యాంక్స్. ఈ సంవత్సరం అనేక పాఠాలు నేర్పింది. ఇలాంటి పరిస్థితులో నాకు మనోధైర్యం ఇవ్వాలని కోరుతున్నాను. మనసుకు ప్రశాంత కోసం ఎదురు చూస్తున్నాను అని అన్నారు. ఇలా కొనసాగుతుండగానే భర్తతో విడాకులు తీసుకొంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
అయితే భర్తతో విడాకుల నేపథ్యంలో అందరూ భారీగా మెయింటెన్స్, భరణాన్ని ఆశిస్తుందని ఊహించారు. కోట్ల రూపాయల్లో భరణాన్ని ఆశించడానికి అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ హన్సిక మాత్రం భర్త నుంచి అణా పైసా తీసుకోకుండా.. తనకు ఎలాంటి భరణం, భృతి అవసరం లేదని చెప్పిందనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే విడాకుల నేపథ్యంలో సమంత కూడా ఎలాంటి భరణం స్వీకరించడకుండా నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











