కుంభమేళా గర్ల్ మోనాలిసా ప్రేమ వివాహంలో ఊహించని ట్విస్ట్‌లు..కేరళ స్టోరీని మించిన మిస్టరీ
సినిమా పరిశ్రమలో పెళ్లి సందడి ఎక్కువగా కనిపిస్తున్నది. యువ హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకొని వార్తల్లో నిలుస్తున్నారు. అయితే కుంభమేళాలో పూసలు అమ్ముతూ అందర్నీ ఆకట్టుకొన్న అందమైన యువతి మోనాలిసా భోంస్లే ఓవర్‌నైట్‌లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా సెలబ్రిటీ స్టేటస్‌ను సొంతం చేసుకొన్నది. పేదరికంతో బాధపడే అమ్మాయిని ఏకంగా సినీ హీరోయిన్‌గా మార్చేసింది. మీడియా హెడ్‌లైన్లలో ఆమె క్రేజీగా మారింది. అయితే తాజాగా తన ప్రేమ వ్యవహారంలో మోనాలిసా ఇచ్చిన ట్విస్ట్ వివరాల్లోకి వెళితే..
హిందీ, తెలుగు సినిమాల్లో నటిస్తున్న మోనాలిసా కొద్దికాలంగా ముస్లిం యువకుడు ఫర్సాన్ ఖాన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమ బంధంగా మార్చుకొన్నారు. ఇటీవల కాలంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో మోనాలిసా కుటుంబ పెద్దలు అభ్యంతరం తెలిపారు. నా తల్లిదండ్రులు మా అత్త కుమారుడిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు అని తెలిపింది.

అయితే మతాంతర బంధం కావడం, వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అభ్యంతరం తెలిపాయి. వారి పెళ్లికి ఫ్యామిలీ నిరాకరించింది. దాంతో ఇంటి సభ్యులకు తెలియజేయకుండా కేరళమ్‌కు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. తమ పెళ్లికి కుటుంబ సబ్యులు ఒప్పుకోవడం లేదు. పెళ్లి చేసుకొంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు. వారి నుంచి మాకు ప్రాణహాని ఉంది. కాబట్టి మాకు రక్షణ కల్పించండి అంటూ పోలీసులను వేడుకొన్నారు.
అయితే తనకు సినిమా పరిశ్రమలో కొనసాగడం ఇష్టం లేదు. సాధారణ జీవితాన్ని ప్రశాంతం, శాంతి సుఖాలతో కొనసాగించాలని అనుకొంటున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యవహారంతో మరోసారి మోనాలిసా ట్రెండింగ్‌లోకి వచ్చారు. అయితే కేరళమ్ పోలీసులు వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని వారికి సెక్యూరిటీ కల్పించారు. అంతేకాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం మోనాలిసా, ఫర్సాన్ పెళ్లికి సహకరించారు.
అయితే మతాంతర వివాహం కావడంతో లవ్ జిహద్ అంటూ వస్తున్న రూమర్లను మోనాలిసా కొట్టిపాడేసింది. తాను మతం మార్చుకోలేదని, అలాగే మతం మార్చుకోనని స్పష్టం చేసింది. ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం కేవలం తన సొంత నిర్ణయమే. ఎవరి బలవంతం లేదు అని మోనాలిసా అన్నారు. అయితే తనకు అన్ని మతాలంటే గౌరవం అని అన్నారు.
అయితే తాను మైనర్ అంటూ వస్తున్న వార్తలను కూడా మోనాలిసా ఖండించారు. తన ఆధార్ కార్డు, ఇతర సర్టిఫికెట్లను పోలీసులకు సమర్పించారు. నార్త్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలు. తాను వయసు రీత్యా మేజర్‌ను. కే ఆప్ ప్రకారం కేరళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకొన్నాం అని అన్నారు. అయితే సాధారణంగా మతమార్పిడిలతో ప్రేమ వివాహాలు కేరళలోనే అధికంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మోనాలిసా మతాంతర వివాహం చేసుకోవడం భారీ చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











