బాలయ్య, బోయపాటి చిత్రం.. హీరోయిన్లు వీళ్ళే!
దర్శకుడు బోయపాటి శ్రీను చివరగా రూపొందించిన వినయ విధేయ రామ చిత్రం నిరాశపరిచింది. సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామ చిత్రం రాంచరణ్ అభిమానులని ఆకట్టుకోలేక పోయింది. దీనితో బోయపాటి తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. బాలయ్యతో హ్యాట్రిక్ మూవీకి సిద్ధం అవుతున్నట్లు బోయపాటి శ్రీను గతంలోనే ప్రకటించాడు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
త్వరలో ప్రారంభం కాబోయే బాలయ్య, బోయపాటి చిత్రంలో హీరోయిన్ల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు యంగ్ హీరోలతో జోడి కట్టిన రకుల్ తొలిసారి బాలయ్య లాంటి సీనియర్ హీరో సరసన నటించబోతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో రకుల్ ప్రీత్ శ్రీదేవి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో రెండవ హీరోయిన్ కు కూడా ఆస్కారం ఉందట. రెండవ హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ కథలతో మ్యాజిక్ చేసే బోయపాటి సరైనోడు చిత్రం తర్వాత ఆకట్టుకోలేకపోతున్నారు. దీనితో బాలయ్యతో రూపొందించే హ్యాట్రిక్ మూవీ విజయం సాధించడం బోయపాటికి చాలా కీలకం.


Click it and Unblock the Notifications











