జాన్వీ కపూర్‌తో అలాంటి రిలేషన్ లేదు.. వివాదానికి యాక్టర్ చెక్
జాన్వీ కపూర్.. అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దల తనయ. తల్లికి తగ్గ అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2018లో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తనదైన శైలిలో ముందుకుపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోందీ భామ.
అయితే ఇప్పుడు ఈ నటీ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఆమెపై సహనటుడు "జాన్వీకి నాకు మధ్య అంతగా లేదు " అని చేసిన కామెంట్స్ వైరల్ గా మారడమే. అంతే కాకుండా ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆ నటుడు నేను ఆ ఉద్దేశంతో అనలేదంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు. ఎంత ఆచితూచి మాట్లాడినా తప్పు అర్థాలు తీస్తారు అనడానికి ఇదో ఉదాహరణ.

బాలీవుడు స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, బీటౌన్ హీరో గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో సుధాన్షు సరియా ఉలఘ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హీరోహీరోయిన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో.. జాన్వీ కపూర్ తో తనకు ఫ్రెండ్ షిప్ లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు.
షూటింగ్ లొకేషన్ లో సినిమాకు సంబంధించి, సన్నివేశాల చిత్రీకరణ సమయంలో మాత్రమే తనతో మాట్లాడేవారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కాస్త సామాజిక మాధ్యమాల్లో వివాస్పదమయ్యాయి. జాన్వీకి పొగరు ఎక్కువు అంటూ కొందరూ, గుల్షన్ ను ట్రోల్ చేస్తూ మరికొందరు సోషల్ మీడియాలో కాంట్రవర్సీ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై మరో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

జాన్వీ కపూర్ తో నాకు స్నేహం లేదన్నాను తప్ప, ఆమె గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదని గుల్షన్ క్లారిటీ ఇచ్చారు. అది మా ఇద్దరి తప్పు కాదని, జాన్వీ ఓ మంచి నటి అని, ఎంతో ప్రొఫెషనల్ గా నటిస్తారని చెప్పుకొచ్చారు. మా ఇద్దరితో చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి, సినిమా కోసం మేం వందశాతం పనిచేశాం. డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు పర్ ఫెక్ట్ గా చేశారు. ప్రతి సినిమా సెట్ లో మూవీ టీం అంతా ఓ కుటుంబంలా కలిసిపోవాలనేం లేదు కదా. అంతే కానీ నేను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా కించపర్లలేదన్నారు.
గతంలో చాలా మంది హీరోయిన్స్‌తో కలిసి నటించాను. నేను స్క్రీన్ షేర్ చేసుకున్న వారందరితో నాకు మంచి స్నేహం ఏర్పడింది, సోనాక్షి సిన్హా, రాధికా ఆప్టే లాంటి స్టార్స్లో కలిసి నటించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. అంతే కాదు మేము చాలా విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లమని గుల్షన్ చెప్పారు. కానీ, జాన్వీతో మాత్రం సినిమా గురించే చర్చించాను అనే విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలోనూ వెల్లడించానని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండని గుల్షన్ అన్నారు.
గుల్షన్ చేసిన కామెంట్స్పై జాన్వీ కూడా స్పందిస్తూ.. అవును నిజమే నేను గుల్షన్ ఎప్పుడూ సెట్ లో ఇతర విషయాలు మాట్లాడకోలేదని, కనీసం కలిసి కూడా కూర్చోలేదన్నారు. కేవలం సినిమా గురించే మాత్రమే తాము మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు.


Click it and Unblock the Notifications











