పెళ్లికి ముందే గర్బవతి అయిన హీరోయిన్.. అందుకు ఆదరాబాదరగా నిశ్చితార్థం..వైరల్‌గా ట్వీట్!
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు, ఊహాగానాలకు తెర దించింది. గత కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రాఘవ్ చద్దాతో అఫైర్, డేటింగ్, సహజీవనం వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే వారిద్దరూ కలిసి జీవించడం మీడియాలో హైలెట్ అయ్యాయి. అయినా వారిద్దరూ మీడియా వార్తలకు దూరంగా ఉంటూ స్పందించడానికి నిరాకరించారు.
ఇటీవల క్రికెట్ మ్యాచ్‌లు, రెస్టారెంట్లు, హోటల్స్, ఎయిర్‌పోర్టులో మీడియా కంటికి చిక్కారు. అయితే చివరకు వారిద్దరి ఎంగేజ్‌మెంట్ వార్త అధికారికంగా రావడంతో అన్ని కథనాలకు తెరపడ్డాయి. అయితే పరిణితి ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో సినీ క్రిటిక్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..

పరిణితి చోప్రా నిశ్చితార్థం: ప్రియాంక చోప్రా జోనస్ సోదరి పరిణితి చోప్రా ఎంగేజ్‌మెంట్ వార్త బయటకు రాగానే మీడియాలో వైరల్ అయింది. మే 12వ తేదీన ఢిల్లీలో రాఘవ్ చద్దాతో పరిణితి చోప్రా నిశ్చితార్థానికి ముహుర్తం నిర్ణయించారు. ఈ నిశ్చితార్థం వేడుకకు ప్రియాంక చోప్రా అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారు. అయితే ప్రియాంక రాకను చాలా గోప్యంగా ఉంచుతున్నారు.

ప్రియాంక చోప్రా తల్లి కామెంట్: ఇదిలా ఉండగా, పరిణితి చోప్రా నిశ్చితార్థం జరుగుతుండటంతో ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా సంబురాల్లో మునిగిపోయారు. పరిణితి, రాఘవ్ నిశ్చితార్థం వార్త నాకు చాలా సంతోషం కలిగించింది. వారిద్దరికి నా శుభాకాంక్షలు. వారిద్దరి జీవితం చాలా సంతోషంగా సాగాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అంటూ మధు చోప్రా సందేశాన్ని పంపారు.

ఢిల్లీలో నిశ్చితార్థం ఎక్కడంటే?: పరిణితి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థానికి ఢిల్లీలోని ప్రముఖ హోటల్ ముస్తాబైంది. దేశ రాజధానిలోని కపుర్తలా హౌజ్‌లో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నిశ్చితార్థం వేడుకలో అద్బుతమైన వంటకాలను అతిథులకు వడ్డించేందుకు భారీ ప్లాన్ చేశారు. చైన్, ఫుడ్ హోటల్ వ్యాపారంలో ఉన్న రాఘవ్ సోదరుడు సహజ్ ఈ ఏర్పాట్లను చూసుకొంటున్నారు.

బాంద్రాలో పరిణితి చోప్రా నివాసంలో: ఎంగేజ్‌మెంట్‌కు ముందు ముంబైలోని పరిణితి చోప్రా నివాసాన్ని పూలు, దీపాలతో భారీగా అలంకరించారు. బాంద్రాలోని పరిణితి నివాసం అందర్నీ ఆకర్షిస్తున్నది. ముంబైలోని పలువురు స్టార్ హీరో, హీరోయిన్లకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఢిల్లీలో బాలీవుడ్ ప్రముఖులు ఈ నిశ్చితార్థంలో హంగామా చేయనున్నారు.
ఉమేర్ సంధూ వివాదాస్పద ట్వీట్: ఇదిలా ఉండగా, దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ ఘాటైన ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్.. పెళ్లికి ముందే పరిణితి చోప్రా గర్భవతి. బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ వల్ల ఆమె తల్లి కాబోతున్నది. అందుకే అర్జెంట్‌గా ఆమె నిశ్చితార్థం చేసుకొంటున్నది అంటూ ట్వీట్ చేశారు. పరిణితి, రాఘవ్ గురించి ఉమేర్ సంధూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











