For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇలియానా మీద బ్యాన్.. అందుకే విధించాం.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిర్మాత!

  |

  బాలీవుడ్‌‌ మీద మక్కువతో సౌత్‌‌ లో అవకాశాలన్నింటినీ వదులుకుని వెళ్లిపోయిన ఇలియానా..రెంటికి చెడ్డ రేవడి అయింది. ఆమెకు అక్కడ అనుకున్నంత సక్సెస్ కాలేదు, ఇక్కడికి తిరిగి రావాలని ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. చేసిన ఒక్క సినిమా కూడా తేడా పడడంతో ఆమె ఇప్పుడు ఇండస్ట్రీ గురించి రకరకాల కామెంట్స్ చేస్తోంది. అయితే ఆమెకు అవకాశాలు రాకపోవడం అనేది నిజం కాదని, ఆమె మీద బ్యాన్ విధించారని అంటూ ఒక సీనియర్ నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  బాలీవుడ్ లో కలిసి రాక

  బాలీవుడ్ లో కలిసి రాక

  దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన గోవా బేబీ ఇలియానా ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలందరితో నటించింది. అప్పట్లో టాప్ హీరోయిన్ గా దూసుకు పోయిన ఆమె తెలుగులో రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి, కానీ అక్కడ కూడా ఆమెకు కలిసి రాలేదు.

  ప్రేమలో ఫెయిల్ అయి

  ప్రేమలో ఫెయిల్ అయి

  ప్రేమికుడితో ప్రేమలో పడి, అక్కడ ఫెయిల్ కావడంతో ఆమె సినిమాలకు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంది. తరువాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ప్రయత్నాలు చేసినా ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. తర్వాత ఆమె బరువు పెరగడంతో చాలా గ్యాప్ తీసుకుంది. ఇక మళ్ళీ లైన్ లోకి వచ్చి ఆమె పాగల్ పత్ని అనే సినిమా ఆలాగే అభిషేక్ బచ్చన్‌‌తో ‘బిగ్‌ బుల్' అనే సినిమాలో నటించింది.

  అభిషేక్ సినిమాతో

  అభిషేక్ సినిమాతో

  ఆ సినిమా మొన్నీమధ్యనే మూవీ ఓటీటీలో రిలీజ్‌‌ కూడా అయింది. అందరూ ద బిగ్ బుల్‌ గా పిలిచే ఇండియన్ స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా చేసిన ఫైనాన్షియల్ క్రైమ్స్ ఆధారంగా ఈ సినిమా చేశారు. హర్షద్ మెహతా పాత్రని అభిషేక్ బచ్చన్ పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కరోనా కారణంగా సినిమాని హాట్‌‌ స్టార్‌‌‌‌లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.

  జులాయే

  జులాయే

  నిజానికి ఆమె తెలుగులో చివరిగా జులాయి అనే సినిమా చేసింది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీ లోనే మరో సినిమా చేయలేదు. దీనికి కారణం ఆమె బాలీవుడ్ లో ఎక్కువ ఫోకస్ పెట్టడమే అని అందరూ భావిస్తారు కానీ దీని వెనుక వేరే కారణం ఉందని తాజాగా తెలుగు దర్శక నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ వెల్లడించారు. దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలో ఆమె నటరాజన్ అనే తమిళ నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ విషయంలో గొడవ పడింది.

   అడ్వాన్స్ బ్లాక్ చేయడంతో

  అడ్వాన్స్ బ్లాక్ చేయడంతో

  విక్రమ్ హీరోగా నబ్బన్ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్న ఇలియానా ముందుగా అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. 40 లక్షల రూపాయల అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని ఇలియానాను కోరగా ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఆయన తమిళ నిర్మాతల మండలి సంప్రదించారు.

   అనధికార బ్యాన్

  అనధికార బ్యాన్

  ఈ విషయం అక్కడ కూడా పరిష్కారం కాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్దకు ఈ వ్యవహారం వచ్చింది. అయితే ఆమె మీద అధికారికంగా బ్యాన్ విధించకుండానే అనధికారికంగా తమ సినిమాలలో ఎవరూ ఆమె తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నామని కాట్రగడ్డ ప్రసాద్ వివరించారు. అందుకే ఆమె 2012 తర్వాత ఒక్క దక్షిణాది సినిమా కూడా చేయలేక పోయిందని ఆయన చెప్పుకొచ్చారు.

  ఎత్తేశారా లేదా?

  ఎత్తేశారా లేదా?

  అయితే మరి ఆమె మూడేళ్ళ క్రితం రవితేజ హీరోగా చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అమకు మళ్ళీ ఇక్కడ అవకాశం దక్కలేదు. అయితే ఆమె మీద అనధికార బ్యాన్ ఎత్తేశారా ? లేదా అనే దాని మీద మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ఈ భామ ప్రస్తుతం రణదీప్ హుడా హీరోగా నటిస్తున్న అన్ఫెయిర్ & లవ్లీ సినిమాలో నటిస్తోంది.

  English summary
  Ileana D’cruz made a transition into Bollywood after getting huge fame in tollywood. but no offer came to her after julayi. producer Katragadda Prasad has decoded the reason behind Ileana’s absence from then.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X