Uorfi Javed బాత్‌టబ్‌లో టాప్‌లెస్‌గా ఉర్పీ జావెద్.. దుబాయ్‌లో ఘాటైన అందాలతో!
హిందీ టెలివిజన్ రంగానికి చెందిన యువనటి, బిగ్‌బాస్ ఫేమ్ ఉర్ఫీ జావెద్ మరోసారి తన అందచందాలతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే పలు మార్లు తన డ్రెస్సింగ్ బిహేవియర్‌తో వివాదాస్పదంగా నిలిచింది. అయితే ఎన్ని కేసులు నమోదైనా తన దారిలోనే తాను ప్రయాణిస్తూ.. మరోసారి అర్ధనగ్నంగా ఫోజులతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా దుబాయ్ పర్యటనలో ఉన్న ఉర్పీ జావెద్ గ్లామర్ ట్రీట్ ఎలా ఉందంటే?
బిగ్‌బాస్ ఓటీటీతో పాపులర్
టెలివిజన్ సీరియల్స్‌లో చిన్నచిన్న పాత్రల్లో నటించి గుర్తింపునకు నోచుకోలేని ఉర్ఫీ జావెద్.. బిగ్‌బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టిన తర్వాత తన గ్లామర్‌తో దుమ్మరేపుతున్నది. విచిత్రంగా, దాదాపు నగ్నంగా కనిపించేలా డ్రస్సులు ధరించి ఉర్ఫీ జావెద్ మీడియాలోను, సోషల్ మీడియాలోను చర్చకు దారి తీసింది.
నూలుపోగు లేకుండా సైకిల్ చైన్లతో
ఇక ఇటీవల ఒంటి మీద నూలు పోగు లేకుండా కేవలం సైకిల్ చైన్లను ధరించి సంచలనం రేపింది. సైకిల్ చైన్లను ఒంటి చుట్టు కట్టుకొని అందాల భామ ఫోజిలిచ్చింది. సైకిల్ చైన్లను కట్టుకొని దిగిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉర్పీ ఫ్యాషన్ చూసి నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.
ఉర్పీ జావెద్‌పై ముంబైలో కేసు
ఉర్పీ జావెద్ అందాల జోరు మితిమీరుతున్నదని, బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలంగా, అసభ్యతను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలపై బాలీవుడ్ వర్థమాన తార, బిగ్‌బాస్ బ్యూటీ ఉర్పీ జావెద్‌పై ముంబైకి చెందిన న్యాయవాది కేసు నమోదు చేశారు. అసభ్యకరంగా దుస్తులు వేసుకొని పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేస్తున్నారంటూ బాంద్రా పోలీసులకు న్యాయవాది అలీ ఖాషిఫ్ ఖాన్ దేశ్‌ముక్ అంధేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఉర్పీ జావెద్ మాత్రం ఎలాంటి పట్టింపు లేకుండా తేలికగా తీసుకొన్నారు.

దుబాయ్‌లో ఘాటైన అందాలతో
అయితే ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఉర్పీ జావెద్ మరోసారి శరీర పైభాగంలో ఎలాంటి వస్త్రం లేకుండా అర్ధనగ్నంగా ఫోటోకు ఫోజిచ్చింది. హోటల్ రూమ్‌లో నిలబడి ఎదురుగా ఎత్తైన భవనం ముందు నిలచుకొని అందాలను ఆరబోసింది. టాప్ లేకుండా కేవలం జీన్స్ ప్యాంట్ వేసుకొని కనిపించింది. బాత్ టబ్‌లో నిలబడి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. తన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్ అయింది.

సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్
ఇటీవల కాలంలో అర్ధనగ్నంగా ఫోటోలు షేర్ చేస్తుండటంతో ఉర్పీ జావెద్ ఇన్స్‌టాగ్రామ్‌కు భారీగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. ట్విట్టర్‌లో 92 వేల మంది ఫాలోవర్స్ ఉండగా, ఇన్స్‌టాగ్రామ్‌లో 38 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. అర్ధనగ్నంగా కనిపించిన ప్రతీసారి ఈ భామను విపరీతంగా ట్రోల్ చేసి ఆటాడుకొంటారు. అయినా తనకు నచ్చినట్టుగానే ఉర్పీ ఉంటూ వస్తున్నది.

ఉర్పీ జావెద్ కెరీర్ ఎలా ఉందంటే?
ఉర్ఫీ జావెద్ కెరీర్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొన్న ఉర్పీ జావెద్ కేవలం 8 రోజుల్లోనే ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా ఎక్స్ 4లో నటిస్తున్నది. గతంలో బడే భయ్యాకి దుల్హనియా, మేరి దుర్గా, బెప్పన్నా, పంచ్ బీట్ సీజన్ 2, ఏ రిస్తా క్యా కెహ్లాతా, కౌసౌటీ జిందగీ కే సీరియల్‌లో నటించింది.


Click it and Unblock the Notifications











