టాలీవుడ్ బెస్ట్ కోడలు ఎవరంటే... డంబెల్స్‌తో సమంత, ఉపాసన పోటీ.. రానా ఏమన్నారంటే..!
కొణిదెల ఇంటి కోడలు ఉపాసన కొణిదెల.. అక్కినేని ఇంటి కోడలు సమంత మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. అంతకంటే వీరిద్దరిని ఒక్కటి చేసింది మాత్రం ఫిట్‌నెస్ మంత్ర అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకొనేందుకు ఎంత కష్టపడుతారో సోషల్ మీడియాలో ఈ ఇద్దరు పెట్టే పోస్టింగులతో అర్థమవుతుంది. తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

బీ పాజిటివ్ మ్యాగజైన్‌పై సమంత
అపోలో హస్పిటల్‌లో ఉపాసన కొణిదెల అత్యంత కీలక బాధ్యతలను నిర్వహిస్తుంటారు. హాస్పిటల్‌లో యాజమాన్య విధులను నిర్వర్తించడంలో ఆమెకు మంచి పేరు ఉంది. ఆ హాస్పిటల్ నిర్వహించే బీ పాజిటివ్ మ్యాగజైన్ కోసం సమంతను సంప్రదించి ఫిటినెస్ మంత్రను అడిగి తెలుసుకొన్నారు. ఆ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై సమంత ఫొటోను వేశారు. ఆ మ్యాగజైన్ ఇప్పుడు పాఠకులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

టాలీవుడ్ ఉత్తమ కోడలు అంటూ
అంతేకాకుండా సమంతపై ఉపాసన కొణిదెల ప్రశంసల వర్షం కురిపించారు. టాలీవుడ్‌లో ఉత్తమ కోడలు అవార్డు సమంతకే దక్కింది అంటూ ట్వీట్ చేశారు. డంబెల్స్ పట్టుకొని సమంతతో కలిసి దిగిన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోకు అనూహ్య స్పందన లభిస్తున్నది.

100 కిలోలు ఎత్తే ఏకైక..
ఇక సమంత ఫిట్‌నెస్ గురించి రానా దగ్గుబాటి చేసిన కామెంట్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఇటీవల నంబర్ 1 యారీ అనే షోకు హాజరైన సమంత ఫిట్ నెస్ ప్రశంసలతో ముంచెత్తారు. టాలీవుడ్‌లో వంద కిలోల బరువు ఎత్తే ఏకైక హీరోయిన్ సమంతనే అని అన్నారు. 150 కిలోల వెయిట్ ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నారు అని అంటే.. నాతో కావడం లేదు.. 100కే పరిమితం అయ్యాను అని సమంత బదులిచ్చింది.

వరుస విజయాలతో సమంత
గత రెండేళ్లుగా సమంత వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. గతేడాది మహానటి, రంగస్థలం, అభిమన్యుడు చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లను సొంత చేసుకొన్నది. 2019 సంవత్సరాన్ని కూడా ఘనంగా ప్రారంభించింది. ఆమె నటించిన సూపర్ డీలక్స్, మజిలీ చిత్రాలు భారీ విజయాలు అందుకొన్నాయి.


Click it and Unblock the Notifications











