త్రిషకు ఉపాసన సర్‌ప్రైజ్.. మెగా కోడలు గిప్ట్ ఏంటో తెలుసా?

సౌత్ ఇండియన్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కుర్ర హీరోయిన్లు వరుసగా ఇండస్ట్రీలోకి వస్తున్నా, రెండు దశాబ్దాల తర్వాత కూడా స్టార్‌డమ్‌ను అలాగే కొనసాగిస్తూ త్రిష తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ రెండింట్లోనూ స్టార్ హీరోయిన్‌గా దశాబ్దాలుగా రాణిస్తున్నారు ఈ అమ్మడు. వరుస విజయాలతో దూసుకెళ్తుంది. అలాగే వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇదిలా ఉంటే.. తాజా త్రిషకు మెగా కోడలు ఉపాసన కొణిదెల (Upasana Konidela) ఒక సమ్మర్ గిఫ్ట్ పంపారు. ఇంతకీ ఆ గిప్ట్ ఎంటి?

సాధారణంగా సెలబ్రిటీల మధ్య ఖరీదైన బహుమతుల మార్పిడి జరుగుతుంటుంది. అలాగే తాజాగా హీరోయిన్ త్రిషకు మెగా కోడలు ఉపాసన కొణిదెల పంపించిన ప్రత్యేక సమ్మర్ గిఫ్ట్ పంపించారు. కానీ, ఉపాసన పంపించిన బహుమతి మాత్రం పూర్తిగా తెలుగు సంప్రదాయ రుచులతో నిండిపోవడం విశేషంగా మారింది. తాజాగా ఉపాసన నిర్వహిస్తున్న 'అత్తమ్మాస్ కిచెన్' బ్రాండ్ తరఫున త్రిషకు ఒక ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు. ఈ హ్యాంపర్ అందుకున్న త్రిష తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Upasana Konidela s Traditional Summer Gift Delights Trisha Athamma s Kitchen Hamper Goes Viral

బాక్స్‌లో ఉన్న వంటకాలు, ప్యాకేజింగ్ చూసి ఎంతో సంతోషించిన ఆమె.. 'వేసవి కాలం వచ్చేసిందన్న ఫీలింగ్ ఈ గిఫ్ట్ చూసిన తర్వాతే కలిగింది' అంటూ స్పందించారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆ గిఫ్ట్ బాక్స్‌లో ఏముందంటే.. తెలుగు కుటుంబాల్లో వేసవికాలంలో తప్పనిసరిగా ఉండే ఆవకాయ పచ్చడితో పాటు పలు రకాల హోమ్‌మేడ్ పొడులు, పొంగల్ మిక్స్, కేసరి మిక్స్, సంప్రదాయ వంటకాల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంటి వంటల రుచిని గుర్తు చేసే ఈ ఉత్పత్తులు త్రిషను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

అసలు అత్తమ్మాస్ కిచెన్ వెనుక ఉన్న ఆలోచన కూడా ఆసక్తికరమే. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన కలిసి గత ఏడాది ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. విదేశాల్లో లేదా ఇతర నగరాల్లో నివసించే తెలుగు ప్రజలు ఇంటి భోజనం రుచిని మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఈ బ్రాండ్‌ను తీసుకొచ్చారు. సులభంగా తయారయ్యే ఇన్‌స్టంట్ మిక్స్‌లు, సంప్రదాయ వంటకాల కోసం అవసరమైన పదార్థాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్ ఉపయోగించకుండా సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేయడం ఈ బ్రాండ్ ప్రత్యేకతగా చెబుతున్నారు.

ప్రస్తుతం అత్తమ్మాస్ కిచెన్ ద్వారా పులిహోర మిక్స్, ఉప్మా మిక్స్, రసం పౌడర్, పొంగల్ మిక్స్, అవకాయ పచ్చడి, ఇతర సంప్రదాయ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఉత్పత్తులకు మంచి స్పందన లభిస్తోంది. బ్రాండ్ ప్రచారంలో భాగంగా సినీ ప్రముఖులకు ప్రత్యేక హ్యాంపర్లు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతముందుకు పెద్ది హీరోయిన్ జాన్వీకి కూడా ఈ స్పెషల్ గిప్టును పంపిన విషయం తెలిసిందే.

ఇక త్రిషకు ఈ గిఫ్ట్ చేరడం వెనుక మరో ఆసక్తికర కారణం కూడా ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'విశ్వంభర' లో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత త్రిష-చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో మెగా కుటుంబంతో త్రిషకు మంచి అనుబంధం ఏర్పడిందని, ఆ స్నేహపూర్వక సంబంధాల నేపథ్యంలోనే ఉపాసన ఈ ప్రత్యేక బహుమతి పంపి ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు త్రిష కెరీర్ ప్రస్తుతం పీక్స్‌లో కొనసాగుతోంది. వయసు పెరుగుతున్నా ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూనే తెలుగు, మలయాళ భాషల్లో కూడా కీలక ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'కరుప్పు' మంచి విజయాన్ని అందుకోగా, తెలుగులో 'విశ్వంభర', మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తున్న 'రామ్' సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఉపాసన పంపించిన ఈ సంప్రదాయ సమ్మర్ గిఫ్ట్ మాత్రం సినీ అభిమానులతో పాటు సోషల్ మీడియా యూజర్లను కూడా ఆకట్టుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X