మరో అగ్ర దర్శకుడి దృష్టిలో పడిన ఉప్పెన బ్యూటీ.. ఏకంగా పాన్ ఇండియా సినిమా?
మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ హిట్ అందుకోవాలి అంటే అదృష్టం హై రేంజ్ లో ఉండాలి. కేవలం కథ ఒక్కటే కాకుండా మిగతా అన్ని అంశాల్లో కూడా కాస్త లక్కు కలిసొస్తేనే హిట్టు కొట్టగలరు. ఇటీవల అదే తరహాలో హిట్టు కొట్టిన కృతి శెట్టి ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అగ్ర దర్శకులు స్టార్ హీరోలు ఈ బ్యూటీతో సినిమా చేయాలని స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఏ మాత్రం తొందర పడకుండా
కృతి శెట్టి మొదట్లో యాడ్స్ ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని టెలివిజన్ సీరియల్స్ లలో కూడా మెరిసిన ఈ భామ.. అలా స్కూల్ దశను దాటిందో లేదో హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చాయి. కానీ అమ్మడు ఏ మాత్రం తొందర పడకుండా కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యింది.

ఉప్పెన.. లక్కీ ఆఫర్
మొదట ఈ బ్యూటీకి తమిళ్ లో ఆఫర్స్ చాలానే వచ్చయట. కానీ అవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని ఒప్పుకోలేదట. ఇక ఉప్పెన సినిమా సెలక్షన్స్ కూడా లక్కుతో వచ్చిందే. ఎందుకంటే ఈ బ్యూటీ కంటే ముందే మరొక కొత్త హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక కృతి కరెక్ట్ గా సెట్టయ్యిందని మళ్ళీ ఆమెను రీ ప్లేస్ చేయక తప్పలేదు.

నాని - రామ్.. సినిమాలతో బిజీగా..
ఇక ఉప్పెన హిట్టవ్వడంతో ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఒక ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో సాయి పల్లవి కూడా మరొక హీరోయిన్ గా నటిస్తోంది. చూస్తుంటే ఆ సినిమాతో మరొక బాక్సాఫీస్ హిట్ అందుకునేలా ఉంది. అలాగే రామ్ పోతినేని - లింగుస్వామి కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ అందుకుంది.
Recommended Video

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో..?
ఇక ఇటీవల స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ అనంతరం పూరి మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు టాక్ వస్తోంది. అందులో యష్ హీరో అని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే నితిన్ తో కూడా ఒక సినిమాకు కమిటీ అయినట్లు టాక్. ఈ రెండింటిలో ఎదో ఒక సినిమాకు కృతి శెట్టి హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు టాక్.


Click it and Unblock the Notifications











