భారీగా పారితోషికం పెంచిన కృతిశెట్టి.. ఉప్పెన తర్వాత షాకింగ్‌గా రెమ్యునరేషన్!

తెలుగు వెండి తెరపైకి అనూహ్యంగా దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ పక్కింటి అమ్మాయిగా అందర్నీ ఆకట్టుకొంటుంది. అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులనే కాకుండా నిర్మాతలను కూడా క్యూ కట్టించేలా చేస్తున్నది. ఉప్పెన లాంటి హిట్ తర్వా త కృతిశెట్టికి డిమాండ్ పెరిగిపోవడంతో అమాంతంగా రెమ్యునరేషన్ పెంచేసినట్టు వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

సురేఖా వాణి బోల్డ్ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా

ఉప్పెనతో హాట్ హీరోయిన్‌గా

ఉప్పెనతో హాట్ హీరోయిన్‌గా

ఉప్పెన రిలీజ్‌కు ముందే కృతిశెట్టి టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా మారిపోయింది. సినీ ప్రముఖులంతా ఆమె ప్రతిభ గురించి ముందే జోస్యం, జాతకం చెప్పేయడంతో ఇండస్ట్రీ దృష్టి కృతిపై పడింది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె డిమాండ్ మరింత పెరిగిపోయింది.

 చిరంజీవి ప్రశంసలతో

చిరంజీవి ప్రశంసలతో

ఉప్పెన రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కృతిశెట్టికి అద్బుతమైన భవిష్యత్ ఉంది. ఉప్పెన రిలీజ్ అయితే ఆమెను పట్టుకోవడం చాలా కష్టం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాతలకు కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోతుంది. ఉప్పెనలో ఆమె నటన, పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్‌లో ఉంటుందని చిరంజీవి ఆకాశానికి ఎత్తేశారు.

కృతిశెట్టి జాతకం ఊహించని విధంగా

కృతిశెట్టి జాతకం ఊహించని విధంగా

ఉప్పెన రిలీజ్ తర్వాత కృతిశెట్టి జాతకం ఊహించని విధంగా మారిపోయింది. సినిమాను తన వంతుగా తన భుజాలపై మోసారని మాట సినీ విమర్శకులతోపాటు సాధారణ ప్రేక్షకులు ప్రశంసించారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా తన పారితోషికాన్ని భారీగా పెంచినట్టు సమాచారం.

ఉప్పెన కోసం 6 లక్షలు

ఉప్పెన కోసం 6 లక్షలు

ఉప్పెన సినిమా కోసం కృతిశెట్టిని తీసుకొన్నప్పుడు ఆమె రెమ్యునరేషన్ రూ.6 లక్షలు అని తెలిసింది. అయితే టాప్ నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టడంతో రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదట. ఉప్పెన తర్వాత తన భవిష్యత్ ఈ రేంజ్‌లో ఉంటుందని కనీసం ఊహించి ఉండరనే మాట సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉప్పెన తర్వాత భారీగా పారితోషికం

ఉప్పెన తర్వాత భారీగా పారితోషికం

ఇక ఉప్పెన తర్వాత కృతిశెట్టి నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ చిత్రంలోనూ, అలాగే సుధీర్ బాబుతో మరో సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రం కోసం రూ.20 లక్షలకుపైనే తీసుకొన్నట్టు తెలిసింది. ఇదంతా ఉప్పెన రిలీజ్‌కు ముందు కథ. ఇప్పుడు చేయబోయే సినిమాకు రూ.60 లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X