twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan Kalyan తో ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన బ్యూటీ.. బేబమ్మ లక్కు మామూలుగా లేదు

    |

    సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య పోటీ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక సినిమా హిట్టయితే చాలు ఒకరి తరువాత మరొకరు ఆఫర్స్ అందుకోవడంలో బిజీగా ఉంటారు. ఈ మధ్య యువ హీరోయిన్స్ సీనియర్ బ్యూటీలకు కూడా గట్టిగా పోటీని ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న కృతి శెట్టి కూడా మెల్లగా డామినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

     తొందరపడకుండా..

    తొందరపడకుండా..

    మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంటే ఇండస్ట్రీ ఫోకస్ మొత్తం వారిపైనే ఉంటుంది. ఇక అందంతోనే కాకుండా నటనతో కూడా మంచి గుర్తింపు అందుకున్న ఉప్పెన బ్యూటీకి ఆఫర్స్ కూడా ఉప్పెనలా వస్తున్నాయి. కానీ అమ్మడు ఏ మాత్రం తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన ఆఫర్స్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది. ఇటీవల అమ్మడికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

    యువ హీరోలతో ఛాన్స్

    యువ హీరోలతో ఛాన్స్

    సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో పరిచయమైన వైష్ణవ్ తేజ్ కు ఏ రేంజ్ లో అయితే క్రేజ్ దక్కిందో అదే తరహాలో హీరోయిన్ కృతిశెట్టికి కూడా మంచి గుర్తింపు దక్కింది. దీంతో వెంటవెంటనే యువ హీరోలతో ఛాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది.

    పవన్ సినిమాలో కూడా

    పవన్ సినిమాలో కూడా

    గబ్బర్ సింగ్ కాంబో హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. ఇక మెయిన్ లీడ్ కోసం ఒక సీనియర్ బ్యూటీని అనుకోని మరొక ముఖ్యమైన పాత్ర కోసం కృతిశెట్టిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బెబమ్మ కెరీర్ ఒక్కసారిగా మారిపోయినట్లే. ఆ సినిమా త్వరలోనే మొదలు కానున్నట్లు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు.

    Recommended Video

    Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
    వరుసగా నాలుగు సినిమాలు

    వరుసగా నాలుగు సినిమాలు

    ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', రామ్ - లింగుస్వామి సినిమాలతో పాటు నాని చేస్తున్న శ్యామ్ సింగరాయ్ లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కోసం హరీష్ శంకర్ కూడా ఆమెపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరి ఈ సినిమాల అనంతరం అమ్మడి స్థాయి ఏ రేంజ్ కు వెళుతుందో చూడాలి.

    English summary
    There is always competition between heroines in the film industry. If one movie hits, one after another will be busy accepting offers. It is understood that these young heroines are also giving stiff competition to senior beauties. It seems that Kriti Shetty, who received a box office hit with the movie Uppena, is also slowly dominating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X