Urfi Javed నీకు అలాంటి డ్రస్ అవసరమా?.. బాలీవుడ్ బోల్డ్ గర్ల్ దుస్తులపై నెటిజన్ల ట్రోలింగ్
బాలీవుడ్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలిచే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. అది ఉర్ఫి జావెద్ అనే విషయం తెలిసిందే. విచిత్ర వేషాధారణ, డ్రస్సింగ్ స్టయిల్‌తో మీడియాను, సినీ వర్గాలను తనదైన శైలిలో ఆకర్షిస్తుంటారు. అయితే ఆమె వేసుకొనే డ్రస్సులు, ఉపయోగించే వస్తువులు అన్నీ విచిత్రంగానే ఉండటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలోఫోకసంతా ఆమెపైనే పడుతున్నది. తాజాగా అల్యూమినియ్‌తో చేసిన డ్రస్‌ను ధరించడంపై నెటిజన్లు ఆమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ ఓటీటీతో పాపులర్
ఉర్ఫీ జావెద్ బడే భయ్యా కి దుల్హానియా, మేరీ దుర్గా, బెప్పన్నాహ్ అండ్ పంచ్ బీట్ సీజన్ 2, యే రిస్తా క్యా కహ్లాతా హై, కసౌటీ జిందగీ కే 2 లాంటి టెలివిజన్ సీరియల్‌లో నటించింది. ఉర్పీ అయితే పలు సీరియల్స్‌లో నటించిన ఉర్పీ జావెద్ గురించి కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే ఎప్పుడైతే బిగ్‌బాస్ ఓటీటీలో తన అందాలను యదేచ్ఛగా ధారపోసిందో.. అప్పటి నుంచి ఉర్పీ జావెద్ రాకెట్ స్పీడ్‌తో సెలబ్రిటీగా మారిపోయింది. నిత్యం పొట్టి దుస్తులు, అర్ధనగ్న ప్రదర్శనలతో మీడియాలో హంగామా చేస్తున్నది. కంగన రనౌత్ హోస్ట్‌గా ఏక్తా కపూర్ రూపొందిస్తున్న లాక్ అప్ రియాలిటీ షోలో పాల్గొన్నది.

హాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్‌తో
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డిజైనర్ దుస్తుల్లో హాట్ హాట్‌గా కనిపిస్తూ మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచింది. తన గ్లామర్ షోను చూపించడానికి హాలీవుడ్‌కు చెందిన డిజైనర్ హారిస్ రీడ్‌తో జత కలిసింది. అప్పటి నుంచి విచిత్ర వేషాధరణతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నది. హారిస్ రీడ్ గతంలో హారీ స్టయిల్స్, ఎమ్మా వాట్సాన్, అడెలీకి ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్నారు.

అల్యూమినియం కోటింగ్‌తో డ్రస్
హారీస్ రీడ్ డిజైన్ చేసిన బోల్డ్ డ్రస్‌ను ధరించి మళ్లీ మీడియాలో హైలెట్‌గా మారింది. అల్యూమినియం లోహంతో చేసిన డ్రస్సును ధరించి కెమెరాలకు చిక్కింది. చిన్నసైజు బ్రా, మిని స్కర్ట్‌ను ధరించి అందాల ఆరబోతతో ఆకట్టుకొన్నది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ అయ్యాయి.

నీకు అలాంటి డ్రస్ అవసరమా?
అయితే అల్యూమినియం లోహంతో చేసిన డ్రస్స్‌ను ధరించిన ఉర్ఫీ జావెద్‌ను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. నీకు అలాంటి డ్రస్ అవసరమా? అంత పొట్టి డ్రస్‌ను ఎందుకు వేసుకొన్నావు? ఆ డ్రస్ కూడా వేసుకోకపోతే ఏమౌతుంది. అలాంటి విచిత్రం దుస్తులను ఎందుకు వేసుకొంటావు అనే కామెంట్లు ఇన్స్‌టాగ్రామ్‌లో కనిపించాయి.

పేరు మార్చుకొన్న ఉర్ఫీ జావెద్
ఇదిలా ఉండగా, ఉర్ఫీ జావెద్ ఎన్ని వేషాలు వేసిన ఆఫర్లు లభించకపోవడంతో కొద్ది రోజులుగా ఆందోళన చెందుతున్నది. దాంతో న్యూమరాలజిస్ట్‌ను కలవడంతో పేరులో ఏదో దోషం ఉంది అంటూ సలహా ఇవ్వడంతో.. ఆ పేరును మార్చుకొన్నది. ఇంగ్లీష్‌లో ఆమె పేరు Urfi అని ఉంటే.. ప్రస్తుతం Uorfi అని మార్చుకొన్నది. పేరు మార్పుతో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందనే ఆశతో ఉర్ఫీ ఉంది. పేరు మార్పు ఏదైనా ఆమె జాతకాన్ని మారుస్తుందా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











