లోదుస్తులతో అరాచకం.. పిన్నీసుల దండలు వేసుకుని అన్నీ వదిలేసింది.. ఇదెక్కడి డ్రెస్ రా నాయనా!

హిందీలో జ‌రిగిన ఓటీటీ బిగ్‌ బాస్‌ మొదటి సీజన్లో కంటెస్టెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఉర్ఫీ జావెద్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తెలుగు వారికి పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు ఉర్ఫీ త‌న హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. రకరకాల డ్రెస్సింగ్ స్టైల్స్‌తో ప్రతి రోజూ అందాల‌ను కనిపించీ కనిపించకుండా నెటిజన్లను టీజ్ చేస్తూ ఉండే ఉర్ఫీ జావెద్ ఇప్పుడు వేసుకున్న పిన్నీసుల డ్రెస్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

హాట్ హాట్ గా

హాట్ హాట్ గా

ఉర్ఫీ జావెద్ 'బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా' సీరియ‌ల్‌తో హిందీ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు పరిచయం అయింది. ఆ తరువాత 'మేరీ దుర్గా' అనే మరో సీరియల్ తో కూడా ఆమె న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే అలా చాలా సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు గత ఏడాది కరణ్ జోహార్ హోస్ట్ గా జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొనడం ద్వారా వచ్చింది.

ఇవేం డ్రెస్సులు

ఇవేం డ్రెస్సులు


అయితే ఈ ఓటీటీ బిగ్‌బాస్ షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఉర్ఫీ తనకు తానే జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. బిగ్ బాస్ తో వచ్చిన గుర్తింపు మ‌రింత పెంచుకోవ‌డానికి ఈ భామ వెరైటీగా, హాట్ హాట్ గా డ్రెస్సులతో రచ్చ చేస్తూ ఉంటుంది. ఆమె వేసుకునే డ్రెస్సులు చూసి ఇవేం డ్రెస్సులురా నాయనా అనుకోక తప్పరు. అందుకే ఉర్ఫీ వేసుకునే డ్రెస్సులు చూసిన నెటిజన్లు ఎప్పటికప్పుడు రకరకాల కామెంట్లు చేస్తుంటారు.

వింత వీడియో

వింత వీడియో


ఆమె ఫోటోలు, వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఉర్ఫీ తన వీడియోను పంచుకోగా ఆమె వీడియోమీద ఇప్పుడు రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉర్ఫీ జావేద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వింత వీడియోను పంచుకున్నారు. ఈ వింత వీడియోలో ఉర్ఫీ కేవలం లో దుస్తులు ధరించి వాటి మీద పిన్నీసులతో దండ వేసుకుంది.

 సేఫ్టీ పిన్స్‌తో

సేఫ్టీ పిన్స్‌తో


ఉర్ఫీ కొత్త దుస్తులు చాలా ప్రత్యేకమైనవి, మీరు అలాంటి దుస్తులు ఎప్పుడూ చూసి ఉండరు. వీడియో చూసిన వెంటనే ఉర్ఫీ ఇలా వేసుకుందేమిటి అని ఆలోచిస్తున్నారు కదా. అవును బోల్డ్ మరియు సిజ్లింగ్ ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ ప్రజలను ఆకట్టుకునే ఉర్ఫీ జావేద్ ఇప్పుడు సేఫ్టీ పిన్స్‌తో చేసిన దుస్తులను ధరించింది. ఉర్ఫీ తన కొత్త వీడియోలో నలుపు రంగు బికినీ ధరించి కనిపించింది. బికినీలో, ఆమె సేఫ్టీ పిన్స్‌తో చేసిన వన్ పీస్ డ్రెస్‌ను ధరించింది.

3 రోజులు పట్టిందని

3 రోజులు పట్టిందని


వీడియోలో, డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఉర్ఫీ సేఫ్టీ పిన్స్‌తో చేసిన తన ప్రత్యేకమైన దుస్తులను ప్రదర్శిస్తూ కనిపించింది. ఉర్ఫీ ముఖంలో ఆమె దుస్తుల వల్ల వచ్చిన ప్రత్యేక ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో యొక్క శీర్షికలో, ఉర్ఫీ తన దుస్తుల వివరాలు అభిమానులతో పంచుకుంది. ఉర్ఫీ క్యాప్షన్‌లో రాశారు - ఈ డ్రెస్ పూర్తిగా సేఫ్టీ పిన్స్‌తో తయారు చేయబడింది. దీన్ని తయారు చేయడానికి 3 రోజులు పట్టిందని ఆమె రాసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X