Don't Miss!
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Urfi Javed పై కేసు నమోదు.. రేప్ చేస్తానంటే పట్టింపులేదా.. ప్రశ్నించిన ఉర్పీ జావెద్
బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలంగా, అసభ్యతను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలపై బాలీవుడ్ వర్థమాన తార, బిగ్‌బాస్ బ్యూటీ ఉర్పీ జావెద్‌పై ముంబైకి చెందిన న్యాయవాది కేసు నమోదు చేశారు. అసభ్యకరంగా దుస్తులు వేసుకొని పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేస్తున్నారంటూ బాంద్రా పోలీసులకు న్యాయవాది అలీ ఖాషిఫ్ ఖాన్ దేశ్‌ముక్ అంధేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఉర్పీ జావెద్ మాత్రం ఎలాంటి పట్టింపు లేకుండా తేలికగా తీసుకొన్నారు. కేసు నమోదు తర్వాత ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెడుతూ..
నాపై ఇంకా ఎన్ని కేసులు పెడుతారు. నన్ను రేప్ చేస్తామని, చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ నా దుస్తులు, నా వస్త్రధారణ గురించి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నా వస్త్రధారణపై ఉన్న అభ్యంతరం.. మగవాళ్లు నాపై బలత్కారం చేస్తానని బెదిరించడంపై ఎందుకు లేదు. వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు అని ఉర్ఫీ జావెద్ ప్రశ్నించారు.

బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఉర్పీ జావెద్ విచిత్రమైన వేషాధారణ, వస్త్రాలంకరణతో ముంబై వీధులను వేడెక్కిస్తుంటుంది. అర్ధనగ్నంగా కనిపిస్తూ నిత్యం మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షిస్తుంటుంది. ఆమె బోల్డ్ లుక్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే.
ఉర్ఫీ జావెద్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా ఎక్స్ 4లో నటిస్తున్నది. గతంలో బడే భయ్యాకి దుల్హనియా, మేరి దుర్గా, బెప్పన్నా, పంచ్ బీట్ సీజన్ 2, ఏ రిస్తా క్యా కెహ్లాతా, కౌసౌటీ జిందగీ కే సీరియల్‌లో నటించింది.